‘Jagan ఆదేశించారు.. కేంద్రం పాటించింది’

ABN , First Publish Date - 2021-07-17T19:42:19+05:30 IST

కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులపై గెజిట్ విడుదల చేయడాన్ని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్వాగతించారు.

‘Jagan ఆదేశించారు.. కేంద్రం పాటించింది’

న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులపై గెజిట్ విడుదల చేయడాన్ని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. షెడ్యూల్ 9లో 107 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్లు అయిన ఇంకా వాటి విభజన జరగలేదని, వాటిపై ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. ఆయనేమన్నారంటే ‘‘జల వివాదాలు తారస్థాయికి చేరాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గెజిట్ ఇచ్చినందుకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు. సుప్రీంకోర్టులో కూడా  నీటి  వివాదం పై పిటిషన్ వేశారు సీఎం జగన్. నీటి వివాదాల అంశంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు... కేంద్ర పాటించింది అనుకోవడంలో తప్పు లేదు. విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్రం త్వరగా జోక్యం చేసుకోవాలి’’ అని లేఖలో తెలిపారు.


తెలుగు భాషపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామ ఖండించారు. తెలుగును కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. భాషపై ఆమె కామెంట్ సరికాదు. రెండు అకాడమీలను కలపడంపై భాషాభిమానుల ఆవేదన అరణ్యరోదన అవుతుంది. సంస్కృత అకాడమీలో తెలుగు అకాడమీని కలపడం బాధాకరం. ప్రాచుర్యం కలిగిన తెలుగు అకాడమీపై ఫోకస్ చేయడం లేదు. తెలుగు అకాడమీలో దాదాపు 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. ముందు వాటిని సెటిల్ చేయాలి. పేక ముక్కలతో తెలుగు భాషను పోల్చడం పదం సరైంది కాదు. లక్ష్మీపార్వతి ప్రకటన కేవలం జూదరులకు తప్ప ఇంకా ఎవరికి నచ్చదు. లక్ష్మీపార్వతి ఆమె స్థాయిని తగించుకున్నారు. ఆమె తన మాటలను వెనకకు తీసుకోవాలి. సీపీఐ నారాయణను నేను అత్యంత గౌరవిస్తాను. నన్ను ఆయన పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాదని అన్నారు. మరి నేను వేసిన పిటిషన్ ఏంటి? మా ముఖ్యమంత్రిపై నారాయణ లాంటి వారు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఆయన కడిగిన ముత్యంల రావాలని పిటిషన్ వేశాను. నారాయణ జోస్యం వందశాతం తప్పు అవుతుంది’’ అని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-07-17T19:42:19+05:30 IST