Vijayamma రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ: శ్రవణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-07-07T21:19:03+05:30 IST

వైఎస్సార్‌సీపీ (YSRCP) గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ (Vijayamma) రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ అని న్యాయవాది శ్రవణ్‌కుమార్‌

Vijayamma రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ: శ్రవణ్‌కుమార్‌

అమరావతి: వైఎస్సార్‌సీపీ (YSRCP) గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ (Vijayamma) రాజీనామా వైసీపీకి పెద్దదెబ్బ అని న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ (Advocate Shravan Kumar) పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) విజయం ప్రజలతో వచ్చింది కాదని, ఆయన గెలుపు వెనుక విజయమ్మ కష్టం ఉందని గుర్తుచేశారు. అధికారం, డబ్బు కోసం తల్లిని దూరం పెట్టడం దారుణమన్నారు. తల్లి, చెల్లికి అన్యాయం చేసినవాడు రాష్ట్రానికి ఏం మంచి చేస్తాడని శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. అధికార పార్టీగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని తెలిపారు. వైఎస్సార్‌, విజయమ్మ ఫొటోలు పెట్టుకోకుండా జగన్ గెలవలేరని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 


విజయమ్మ సాగనంపేందుకు జగన్ ఎత్తుగడ వేశారు. ఆమెతోనే స్వయంగా రాజీనామా చేయించే విధంగా జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్నాయి. విజయమ్మ తెలంగాణలో వైఎస్సార్‌టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ఉండడం కుదరదనే ఉద్దేశంతో ఆమెను తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయలక్ష్మిని తొలగించాలంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దీనిపై న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. వైఎస్ జయంతోత్సవాల సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లి అక్కడ నుంచి నేరుగా వచ్చి ప్లీనరీ సమావేశాలు ప్రారంభిస్తారు.

Updated Date - 2022-07-07T21:19:03+05:30 IST