కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు: Sharmila

ABN , First Publish Date - 2022-04-29T19:19:28+05:30 IST

సీఎం కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు: Sharmila

భద్రాద్రి కొత్తగూడెం:  సీఎం కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. శుక్రవారం అశ్వారావుపేట నియోజక వర్గం మామిళ్లగూడెం గ్రామంలో రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ఒక దొంగ.. భూములు గుంజుకుంటున్న దొంగ అని వ్యాఖ్యానించారు. మొక్కలు నాటేందుకు పేదలు సాగు చేసుకున్న భూములే కావాలా అని ప్రశ్నించారు. ఎస్సీలు, ఎస్టీలు మనుషులు కారా... పురుగుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోటలు కట్టుకోవాలని కాని...సామాన్యుడు ఆత్మహత్యలు చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ కాళ్ళమీద పడి బాంచన్ దొర అని అడుక్కోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు... కేసీఆర్ మాటలు మారుస్తూ ఉంటారని అన్నారు. కేసీఆర్ వి అన్ని తాగుబోతు మాటలే అని మండిపడ్డారు.


యాసంగి ధాన్యంపై ఢిల్లీలో పోరు అని తలదించుకుని ఉత్త చేతులతో తిరిగి వచ్చారన్నారు. 7 వేల కొనుగోలు కేంద్రాల్లో తెరిచింది 2 వేల కేంద్రాలు మాత్రమే అని షర్మిల అన్నారు. తెరిచిన రెండువేల కేంద్రాల్లో 100 సెంటర్లలో కూడా ధాన్యం కొనడం లేదని తెలిపారు. 60 లక్షల టన్నులు ఈ యసంగిలో కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు కొన్నది కేవలం రెండు లక్షల టన్నులు కూడా లేదని తెలిపారు. 58 లక్షల టన్నులు ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు. ‘‘ఇప్పుడు కేసీఆర్ దేశాలు ఏలబోతాడు అంట. అమ్మకు అన్నం పెట్టడు.. కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తాడట. ఢిల్లీకి వెలతాడట.. రాజ్యాంగాన్ని మారుస్తడట... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇవేమీ అవసరం లేదట. రాజ్యాంగాన్ని మార్చమని కేసీఆర్ నీ ఎవరు అడిగారు..ఆయనకు సిగ్గు ఉండాలి’’ అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-04-29T19:19:28+05:30 IST