ఉద్యమకారుడిని గద్దెనెక్కిస్తే కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీలేదు: షర్మిల

ABN , First Publish Date - 2022-04-30T00:24:28+05:30 IST

ఉద్యమకారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత షర్మిల దుయ్యబట్టారు.

ఉద్యమకారుడిని గద్దెనెక్కిస్తే కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీలేదు: షర్మిల

భద్రాద్రి కొత్తగూడెం: ఉద్యమకారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత షర్మిల దుయ్యబట్టారు. జిల్లాలోని ముల్కలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో వైఎస్ షర్మిల మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా  ఆమె మాట్లాడుతూ ఉద్యమ కారులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ కు ద్రోహులుగా మారారని విమర్శించారు. రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే కేసీఆర్ కోటేశ్వరుడు ఎలా అయ్యాడని ఆమె ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారం అయ్యిందన్నారు. పంట నష్టపోతే కనీసం పరిహారం ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ దని షర్మిల విమర్శించారు. కేసీఆర్ ప్రతి కుటుంభం మీద 4 లక్షల అప్పు పెట్టాడు,కనీసం ఒక లక్ష అయినా ఏ ఒక్క కుటుంభానికి ఇచ్చాడా? అని ఆమె ప్రశ్నించారు. 


టీఆరెఎస్ భవన్ పెట్టుకున్న స్థలం స్ధలం  వైఎస్సార్ ఇచ్చిందేనని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు టీఆరెఎస్ పార్టీ అకౌంట్ లో 860 కోట్లు ఉన్నాయట. వడ్డీలే ప్రతి నెలా మూడు కోట్లు వస్తుందట. ఒకప్పుడు ఏమి లేని టీఆరెఎస్ పార్టీ కి ఇంత డబ్బు ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. టీఆరెఎస్ అకౌంట్ లోనే ఇంత డబ్బు ఉంటే కేసీఆర్ అకౌంట్ లో లక్షల కోట్లు ఉండాలని షర్మిలా అన్నారు.రైతులు సీజన్ తర్వాత సీజన్ లో అప్పులపాలు అవుతుంటే కేసీఆర్ మాత్రం కోటీశ్వరుడు అవుతున్నాడని అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల మీద సింహాసనం వేసుకొని కేసీఆర్ కూర్చున్నాడని అన్నారు.ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే వున్నాయన్నారు.


Updated Date - 2022-04-30T00:24:28+05:30 IST