యుద్ధ ప్రాతిపదికన డ్యాం కట్టకు మరమ్మతులు

Nov 30 2021 @ 23:09PM

రాపూరు, నవంబరు 30: కం డలేరు డ్యాం మట్టికట్టపై 6వ కిలో మీటరు వద్ద గుంత పడి న విష యం తెలిసిందే  ఎమ్మెల్యే ఆనం, గంగ చీఫ్‌ ఇంజనీరు హరి నారాయణరెడ్డి ఆదేశాల మే రకు డ్యాం ఇంజనీర్లు మంగళవారం కట్టమీద ఉన్న చెట్లను తొలగించి  ఇసుక బస్తాలు వేసి గుంతను పూడ్చి వేస్తున్నారు. రాపూరు పెద్ద చెరువు పటిష్టత కోసం సోమవారం  ఇసుక బస్తా లు వేస్తున్నారు. చెరువు కట్ట తెగిపోతుందంటూ వదంతులు రావడంతో ఆదివారం రాత్రి అధికా రులు  చెరువు కట్ట్టకు గండి కొట్టిన విషయం తెలిసిందే. తుఫాన్‌ హెచ్చరికలతో నీటి పారుదల శాఖ ఏఈ సుబ్బరాజు, చెరువు కాంట్రాక్టరు కలసి వెయ్యి బస్తాలను వేయించారు. 

మూడు నెలల్లో స్పిల్‌వే పనులు పూర్తిచేస్తాం

 కండలేరు డ్యాం స్పిల్‌వే పనులను మూడు నెలల్లో పూర్తిచేసి సుమారు 50 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని డ్యాం నుంచి బయటకు పంపుతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవరధన్‌రెడ్డి తెలిపారు.  మంగళవారం ఇంజనీరింగ్‌ అధికారులతో కలసి ఆయన డ్యాంను పరిశీలించారు. డ్యాం మట్టికట్టకు ఎలాంటి ఢోకా లేదన్నారు. డ్యాం భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై మరోసారి నిపుణుల కమిటీతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.