లులు గ్రూప్స్ అధినేతకు బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-02-14T15:04:51+05:30 IST

లులు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీకి బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం దక్కింది. యూసుఫ్ అలీకి బహ్రెయిన్ ప్రభుత్వం గోల్డెన్ రెసిడెన్సీ వీసాను అందించింది. దీంతో బహ్రెయిన్‌లో గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొం

లులు గ్రూప్స్ అధినేతకు బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: లులు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీకి బహ్రెయిన్‌లో అరుదైన గౌరవం దక్కింది. యూసుఫ్ అలీకి బహ్రెయిన్ ప్రభుత్వం గోల్డెన్ రెసిడెన్సీ వీసాను అందించింది. దీంతో బహ్రెయిన్‌లో గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందిన తొలి వ్యక్తిగా యూసుఫ్ అలీకి గుర్తింపు పొందారు. ఈ విషయాన్ని స్వయంగా లులు గ్రూప్స్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. బహ్రెయిన్ నుంచి తొలి గోల్డెన్ రెసిడెన్సీ వీసాను అందుకోవడం పట్ల యూసుఫ్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో పొందిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా బహ్రెయిన్‌ ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే.. 2014 బహ్రెయిన్ కింగ్ చేతుల మీదుగా ‘వెస్సామ్ అల్ బహ్రెయిన్’ పురస్కారాన్ని యూసుఫ్ అలీ అందుకున్నారు. దీంతో ఆ దేశ అత్యన్నత పురస్కారాన్ని అందుకున్న తొలి బహ్రెయినేతర వ్యక్తిగా అప్పట్లో లులు గ్రూప్స్ అధినేత గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్థిక అభివృద్ధి కోసం బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ వీసాను ప్రవేశపెట్టింది. 




Updated Date - 2022-02-14T15:04:51+05:30 IST