Advertisement

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

Mar 6 2021 @ 00:23AM

కౌడిపల్లి, మార్చి 5: విద్యుదాఘాతంతో యువరైతు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయిలాపూర్‌ తండాకు చెందిన బానోత్‌ మహేందర్‌(20) తమ వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ బోరుమోటారు నడవకపోవడంతో స్టార్టర్‌ వద్దకు వెళ్తున్న సమయంలో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Follow Us on:
Advertisement