‘మానాడు’ ఆడియో రైట్స్‌ యువన్‌ సొంతం

Jun 9 2021 @ 11:16AM

వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో హీరో శింబు(సిలంబరసన్‌) నటించిన తాజా చిత్రం ‘మానాడు’. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు. శింబుకు సరసన కళ్యాణి ప్రియదర్శన్‌ నటించింది. అయితే, ఈ చిత్రంలోని పాటల్లో ఓ సింగిల్‌ను రిలీజ్‌ చేసే విషయంపై గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. దీనికి చిత్ర నిర్మాత సురేష్‌ కామాక్షి ఫుల్‌స్టాఫ్‌ పెట్టారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ‘మానాడు’ చిత్ర ఆడియో రైట్స్‌ను యువన్‌ శంకర్‌ రాజాకు చెందిన ‘యు-1’ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని పాటలను ఏఏ తేదీల్లో ఏఏ సమయాల్లో విడుదల చేస్తారో లిటిల్‌ మ్యాస్ట్రో యువన్‌ శంకర్‌ రాజా స్వయంగా వెల్లడిస్తారు. ‘నిజానికి రంజాన్‌ పండుగ రోజున ఈ చిత్రానికి సంబంధించి తొలి సింగిల్‌ను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశాం. కానీ చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు తల్లి మృతి చెందడంతో ఆ పాటను విడుదల చేయలేకపోయాం. ఆ తర్వాత హీరోను సంప్రదించగా, లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే తొలి సింగిల్‌ను విడుదల చేద్దామని హీరో చెప్పారు. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు యువన్‌ వద్ద చెప్పగా, బుధవారం ఈ సింగిల్‌ రిలీజ్‌ తేదీని వెల్లడిద్దామని చెప్పారు.’ అని చిత్ర నిర్మాత సురేష్‌ కామాక్షి వెల్లడించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.