ఆటో బోల్తాపడి యువతి మృతి

ABN , First Publish Date - 2021-01-24T04:44:43+05:30 IST

ఆటో బోల్తాపడి యువతి మృతి

ఆటో బోల్తాపడి యువతి మృతి
సంగీత (ఫైల్‌)

తండ్రి నడుపుతుండగా ప్రమాదం

నర్మెట, జనవరి 23: మండలంలోని హన్మంతాపూర్‌లో ఆటో బోల్తాపడి ఓ యువతి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... హన్మంతాపూర్‌ గ్రామ శివారు తెట్టెకుంటతండాకు చెందిన భూక్య జవహర్‌లాల్‌ వ్యవసాయంతో పాటు ట్రాలీఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఎరువుల బస్తాల కోసం ట్రాలీఆటోలో కూతూరు సంగీత(18)ను తీసుకొని నర్మెటకు వెళ్లాడు. బస్తాలతో తిరిగి వస్తుండగా హన్మంతాపూర్‌ శివారులో కుక్కలు అడ్డురావడంతో సడన్‌ బ్రేక్‌ వేయగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. తండ్రి పక్కనే కూర్చున్న సంగీత కిందపడగా ఆటో తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి లలిత రోదనలతో అందరు కంటతడి పెట్టారు. సంగీత నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ పీజీ చేస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-01-24T04:44:43+05:30 IST