Former India all rounder యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ దంపతులకు మగబిడ్డ

Published: Wed, 26 Jan 2022 07:12:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Former India all rounder యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ దంపతులకు మగబిడ్డ

న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భార్య హాజెల్ కీచ్ దంపతులకు మంగళవారం మగబిడ్డ పుట్టారు.తమకు మగబిడ్డ పుట్టాడని యువరాజ్ సింగ్, హేజల్ దంపతులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘మా అభిమానులు, కుటుంబం, స్నేహితులందరికీ, దేవుడు మాకు మగబిడ్డను ప్రసాదించాడని చెప్పడానికి మేం సంతోషిస్తున్నాం.మగబిడ్డను ప్రసాదించినందుకు  దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.’’ అని యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.యువరాజ్, సినీనటి హాజెల్ కీచ్ లు 2016 నవంబర్ 30వతేదీన ఫతేఘర్ సాహిబ్ గురుద్వారాలో ఆనంద్ కరాజ్ సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. వీరికి మగబిడ్డ మొదటి సంతానం.సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించిన ‘బాడీగార్డ్’ వంటి బాలీవుడ్ చిత్రాలలో హాజెల్ నటించింది. 

ఆ తర్వాత 2013లో రియాల్టీ టీవీ షో బిగ్ బాస్ షోలో కనిపించింది.యువరాజ్ 2019 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇతను వివిధ లీగ్‌లలో ఆడటం కనిపించింది. గత సంవత్సరం, సౌత్‌పా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో కనిపించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టులో యువరాజ్ సభ్యుడు.యువరాజ్ 2019 జూన్ 10వతేదీన అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 304ఓడీఐలు, 58 టీ20Iలు, 40 టెస్ట్‌లకు పైగా ఆడారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.