ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌కు ఓటీటీ సంస్థ శ్రీకారం

Jul 22 2021 @ 19:52PM

ఓటీటీ సంస్థ అనగానే ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఓటీటీ అంటే ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాముఖ్యత ఇస్తుందనేలా ఓటీటీ సంస్థ ‘జీ5’ నిరూపించుకుంటుంది. ‘జీ5 సంకల్పం’ పేరుతో ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఆ సంస్థ  శ్రీకారం చుట్టింది. జూలై 30 నుంచి ఆగస్టు 8 వరకూ హైదరాబాద్‌లో ఈ ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ‘జీ5’ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ప్రజలకు ఉత్తమ వినోదం అందించడమే జీ5 ప్రధాన లక్ష్యం. వివిధ భాషలు, వివిధ ప్రజల అభిరుచికి తగ్గట్టు కంటెంట్‌ అందిస్తున్నాం. వినోదం అందించడంతో పాటు ప్రస్తుత కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాం. ‘జీ5 సంకల్పం’ ద్వారా వీలైనంతమందికి వ్యాక్సిన్‌ అందించాలని అనుకుంటున్నాం. బాధ్యతాయుతమైన సంస్థగా ప్రజలకు వ్యాక్సిన్‌ మీద అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టాం’’ అన్నారు జీ5 ఇండియా ఛీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీషా కార్లా. కాగా, వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకుంటున్న హైదరాబాద్‌ ప్రజలు జూలై  26 వరకూ జీ5 సంస్థ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జూలై 30 నుంచి ఆగస్టు 8వరకూ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందని.. కోవీషీల్డ్‌ (తొలి డోసు), కోవీషీల్డ్‌ లేదా కోవాగ్జిన్‌ (రెండో డోసు – తొలి డోసు ఏదీ తీసుకుంటే అది) ప్రజలకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలియజేసింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.