అర్హత ఉన్నా అందని సున్నా వడ్డీ పథకం

ABN , First Publish Date - 2021-06-23T06:21:53+05:30 IST

మండలవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు అర్హత ఉన్నా ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ పథకానికి దూరమవుతున్నాయి.

అర్హత ఉన్నా అందని సున్నా వడ్డీ పథకం
కణేకల్లులోని వెలుగు కార్యాలయం

లబోదిబోమంటున్న మహిళా సంఘాల సభ్యులు


కణేకల్లు, జూన 22 : మండలవ్యాప్తంగా పలు మహిళా సంఘాలు అర్హత ఉన్నా ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ పథకానికి దూరమవుతున్నాయి. దాదాపు 87 సంఘాలకు ఈ పథకం కింద సొమ్ము పడకపోవడం తో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మండలంలో దాదాపు 1333 మహిళా సంఘాలు వున్నాయి. ఇందులో 1246 సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద రూ.1.25 కోట్ల సొమ్ము జమ అయ్యింది. కాగా మరో 87 సం ఘాలకు సొమ్ము పడలేదు. అన్ని అర్హతలు వుండి సొమ్ము పడని సంఘా లు 43 వుండగా, మిగిలిన సంఘాలు కొత్తగా ఏర్పాటయ్యాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లిస్తూ కొత్త రుణం కోసం పాత రుణాన్ని మూసివేసే సమయానికి సున్నా వడ్డీ పథకం విడుదలైంది. దీం తో ఆయా సంఘాలకు వర్తించకపోవడంతో పలు మహిళా సంఘాలు సు న్నా వడ్డీ కోల్పోతున్నాయి. మరోవైపు బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు కొన్ని సంఘాలు మిస్‌మ్యాచ కింద వుండటంతో వాటికి కూడా పథకం వర్తించ లేదు. ఇలా అన్ని అర్హతలు ఉన్నా కూడా కొన్ని సంఘాలకు సున్నావడ్డీ ప డకపోవడంతో మహిళలు వెలుగు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2020 ఏప్రిల్‌  20 నుంచి ఫిబ్రవరి 2021లోపు రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి సున్నా వడ్డీ పథకం అమలైంది. ఇదే సమ యంలో అనేక సంఘాలు రుణాలు సక్రమంగా చెల్లించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నారు. 


త్వరలోనే అందిస్తాం 

శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం, కణేకల్లు 

మండలంలో దాదాపు 43 సంఘాలకు వివిధ కారణాలతో సున్నా వడ్డీ పథకం సొమ్ము జమ కాలేదు. అలాంటి సంఘాల జాబితాను సిద్ధం చేశాం. అందులో పొరపాట్లు ఇప్పటికే సరిదిద్దాం. త్వరలోనే ఆయా సంఘాలకు కూడా సున్నా వడ్డీ సొమ్మును అందజేస్తాం. మహిళా సంఘాల సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 


Updated Date - 2021-06-23T06:21:53+05:30 IST