79,624 సంఘాలకు సున్నా వడ్డీ పథకం : మంత్రి

ABN , First Publish Date - 2021-04-24T04:51:09+05:30 IST

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు రూ. 18 వేల కోట్లు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

79,624 సంఘాలకు సున్నా వడ్డీ పథకం : మంత్రి
చెక్‌లు అందజేస్తున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

పెనుమంట్ర/పాలకొల్లు టౌన్‌/ నరసాపురం , ఏప్రిల్‌ 23 : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు  రూ. 18 వేల కోట్లు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మార్టేరులోని రెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం చెక్కుల పంపిణీ క్యార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 79,624 స్వయం సహాయక సంఘాలకు రూ. 119 కోట్లు అందిస్తున్నామన్నారు. ఆచంట నియోజకవర్గంలో 5,319 సంఘాలకు రూ. 8.91 కోట్లు వారి ఖాతాల్లో జమవుతుందని అన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో  4,494 డ్వాక్రా గ్రూపులకు రూ.7.53 కోట్లు సున్నా వడ్డీ విడుదల చేయనున్నట్టు ఏపీఎం పి.సతీష్‌కుమార్‌ తెలిపారు. మునిసిపల్‌ కార్యాలయంలో డ్వాక్రా సున్నా వడ్డీ నిధుల చెక్కులను వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. నరసాపురం పట్టణంలోని 31 వార్డుల్లో 693 పొదుపు సంఘాలకు రూ.79 లక్షలు ప్రభుత్వం జమ చేస్తుందని   శ్రీహరిపేట సచివాలయంలో శుక్రవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణ తెలిపారు. మండలంలోని 1581 డ్వాక్రా గ్రూపులకు రూ 2.15 కోట్లు సున్నా వడ్డీ ప్రభుత్వం అందిస్తున్నట్టు ఐకేపీ మేనేజర్‌ పద్మజ తెలిపారు.మునిసిపల్‌ ఓపెన్‌ థియేటర్‌లో చెక్కుల రూపంలో మహిళలకు అందిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-04-24T04:51:09+05:30 IST