‘సున్నా వడ్డీ పేరుతో రైతులకు ప్రభుత్వం దగా ’

ABN , First Publish Date - 2020-12-03T05:48:58+05:30 IST

సున్నా వడ్డీ పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులకు నామాలు పెడుతుందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరక సత్యనారాయణ ఆరోపించారు.

‘సున్నా వడ్డీ పేరుతో రైతులకు ప్రభుత్వం దగా ’
విలేఖర్లతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

 నాతవరం, డిసెంబరు 2 : సున్నా వడ్డీ పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులకు నామాలు పెడుతుందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరక సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం టీడీపీ నాయకులతో కలిసి చినగొలుగొండపేటలో విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ సున్నా వడ్డీ ఇస్తున్నట్టు చెపుతున్నా.. రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు పడడం లేదన్నారు. అలాగే, ఇటీవల నివర్‌ తుఫాన్‌ కారణంగా మండలంలో రైతులు  వరి పంట నష్టపోయినా  అధికారులు చాలా మంది వద్దకు వెళ్లి నష్టం వివరాలు సేకరించలేదని పేర్కొన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పాస్టర్లకు ఏడాదికి ప్రభుత్వం రూ.60 వేలు సాయం చేస్తుందని, కానీ అందరికీ అన్నం పెట్టే  రైతులకు ఏడాదికి ఏడు వేల రూపాయలే సాయం చేయడం దారుణ మన్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తే నిజమైన అర్హులెవరో ప్రజలకు తెలుస్తుందన్నారు.  విద్యా ర్థులకు మూడు జతల చొప్పున యూనిఫాం ఇస్తున్నట్టు చెప్పారని, కానీ బట్ట టైలర్ల వద్దకు తీసుకు వెళితే రెండు జతలకు మాత్రమే సరిపో తుందని చెపుతున్నారన్నారు. ఇలా అన్నింటిలోనూ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి జరుగుతోందని వాపోయారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ ఇటంశెట్టి సీతారామ్మూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:48:58+05:30 IST