కంగారులను కంగారుపెట్టిన జింబాబ్వే.. ఆసీస్ గడ్డపై 18 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం

ABN , First Publish Date - 2022-09-03T18:14:01+05:30 IST

18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా(Australia) గడ్డపై ఆడుతోన్న జింబాబ్వే సంచలన రికార్డ్(Zimbabwe sensational record) సృష్టించింది

కంగారులను కంగారుపెట్టిన జింబాబ్వే.. ఆసీస్ గడ్డపై 18 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం

టౌన్స్‌విల్లీ: 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా(Australia) గడ్డపై ఆడుతోన్న జింబాబ్వే సంచలన రికార్డ్(Zimbabwe sensational record) సృష్టించింది. 18 ఏళ్లుగా ఆసీస్ గడ్డపై విజయం సాధించాలని కసితో ఉన్న జింబాబ్వే.. నేడు ఆ కలను సమిష్టి కృషితో నేరవేర్చుకుంది. ఇక..మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా- జింబాబ్వే(Australia-Zimbabwe) మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్‎కు గట్టి షాక్ తగిలింది. జింబాబ్వే జట్టు మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 39 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి చేధించింది. జింబాబ్వే బ్యాటింగ్‎లో తడివానాశే మారుమని 35, చకబ్వా 37 రన్స్ చేసి రాణించడంతో జింబాబ్వే జట్టు విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్‎కు 3 వికెట్లు దక్కగా..కామెరాన్, గ్రీన్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్ కు తలో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి ఆస్ట్రేలియా టీమ్..బ్యాటింగ్ దిగింది. జింబాబ్వే బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు 141 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‎ను కోలుకోలేని దెబ్బతీశాడు. తనకు తోడుగా ఎవాన్స్‌ రెండు, విలియమ్స్‌, న్యాచీ, నగర్వా తలా వికెట్‌ తీసుకున్నారు. ఆసీస్ బ్యాటింగ్‎లో వార్నర్ మాత్రమే 94 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేయగా..మిగతా ఆటగాళ్లు మొత్తం కలిసి 47 రన్స్ చేయడంతో..31 ఓవర్లలో 141 పరుగులు చేయగలిగింది.

Updated Date - 2022-09-03T18:14:01+05:30 IST