Zimbabwe vs India: జింబాబ్వేతో తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. కళ్లన్నీ అతని పైనే..

ABN , First Publish Date - 2022-08-18T18:09:38+05:30 IST

జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ ఎంచుకోవడం ద్వారా తమకు మంచి అవకాశం దక్కిందని..

Zimbabwe vs India: జింబాబ్వేతో తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. కళ్లన్నీ అతని పైనే..

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బౌలింగ్ ఎంచుకోవడం ద్వారా తమకు మంచి అవకాశం దక్కిందని టాస్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. చాలా రోజులుగా గాయాల కారణంగా జట్టుకు దూరమైన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌ ద్వారా మళ్లీ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడని రాహుల్ తెలిపాడు. మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో.. వన్డేలను కూడా పొట్టి ఫార్మాట్‌ దృష్టితోనే చూస్తున్నారు. ఈ క్రమంలో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్‌ ధనాధన్‌ ఆటతో అదరగొట్టాలని చూస్తోంది. కాగా, టీ20 వరల్డ్‌కప్‌లో కీలక ఆటగాడిగా భావిస్తున్న కేఎల్‌ రాహుల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత శస్త్ర చికిత్స, కొవిడ్‌ బారినపడిన రాహుల్‌కు ఈ సిరీస్‌లో రాణించడం ఎంతో కీలకం. రెండు నెలలకు పైగా ఆటకు దూరంగా ఉన్న అతడు.. ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను నిరూపించుకుంటే వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఓపెనర్‌ సమస్య తీరుతుంది.



ఆసియా కప్‌లో ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ ఆట గాడిన పడాలని రోహిత్‌ శర్మ, కోచ్‌ ద్రవిడ్‌ ఆశిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌పై భారీ స్కోర్లను ఛేదించిన ఆత్మవిశ్వాసంలో ఉన్న చికాబ్వా సేన.. భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది. సికందర్‌ రజా, చికాబ్వా, ఇన్నోసెంట్‌ కయా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కానీ, బంగ్లా కంటే ఎంతో మెరుగైన టీమిండియా బౌలింగ్‌ను వీరు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తంగా చూస్తే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.



జింబాబ్వే : మరుమణి, కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ, సికందర్‌ రజా, చకాబ్వా (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ర్యాన్‌ బర్ల్‌, లూక్‌ జాంగ్‌వి, బ్రాడ్‌ ఇవాన్స్‌, విక్టర్‌ ఎన్‌యౌచి, రిచర్డ్ నగర్వ


టీమిండియా: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్సర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

Updated Date - 2022-08-18T18:09:38+05:30 IST