Zimbabwe vs India : మూడో వన్డేలో ముచ్చెమటలు పట్టించిన జింబాబ్వే.. భారత్‌కే దక్కిన విజయం..సిరీస్ క్లీన్ స్వీప్..

ABN , First Publish Date - 2022-08-23T02:38:15+05:30 IST

జింబాబ్వే వర్సెస్ ఇండియా (Zimbabwe vs India) మూడవ వన్డేలో టీమిండియా చెమటోడ్చి విజయం సాధించింది. 4

Zimbabwe vs India : మూడో వన్డేలో ముచ్చెమటలు పట్టించిన జింబాబ్వే.. భారత్‌కే దక్కిన విజయం..సిరీస్ క్లీన్ స్వీప్..

హరారే : జింబాబ్వే వర్సెస్ ఇండియా (Zimbabwe vs India) మూడవ వన్డేలో టీమిండియా చెమటోడ్చి విజయం సాధించింది. 290 పరుగుల లక్ష్య చేధనలో 49.3 ఓవర్లలో 276 పరుగుల వద్ద జింబాబ్వే ఆలౌట్ అవ్వడంతో 13 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఓటమి పాలైనప్పటికీ లక్ష్య చేధనలో జింబాబ్వే బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ముఖ్యంగా 115 పరుగుల భారీ శతకంతో మెరిసిన సికందర్ రజా తన జట్టుని గెలిపించినంత పనిచేశాడు. కానీ కీలక దశలో థాకూర్ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ విజయబావుటా ఎగురువేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహార్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్ తలో 2 వికెట్లు చొప్పున తీయగా.. ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు, శార్ధూల్ థాకూర్ 1 చొప్పు వికెట్లు పడగొట్టారు.


జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌లలో కైటనో (13), ఇన్నోసెంట్‌ కెయా(6), చకబ్వా (కెప్టెన్‌)(16), టోనీ మున్యోంగ(15), సికందర్‌ రజా(115), సీన్‌ విలియమ్స్‌(45), ర్యాన్‌ బుర్ల్‌(8), లూక్‌ జోంగ్వే(14), బ్రాడ్‌ ఇవాన్స్‌(28), రిచర్డ్ నరవా(2 నాటౌట్), విక్టర్ న్యాచీ(0) చొప్పున పరుగులు చేశారు.


ఇక భారత బ్యాటింగ్ విషయానికి వస్తే.. ధవన్ (40), రాహుల్(30), శుభ్‌మన్ గిల్(130), ఇషాన్ కిషన్(50), దీపక్ హుడా(1), సంజూ శాంసన్ (15), అక్సర్ పటేల్(1), థాకూర్(9), డీ చాహార్(1), కుల్దీప్ యాదవ్(2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

Updated Date - 2022-08-23T02:38:15+05:30 IST