జింకలకు రక్షణేది..?

ABN , First Publish Date - 2020-12-04T04:17:49+05:30 IST

అడవులను అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపయోగపడే లా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు.

జింకలకు రక్షణేది..?
బొక్కల గుట్టలోని జింకల పునరావాస కేంద్రం

కూలిన పునరావాస కేంద్రం ప్రహరీ

నెలలు గడుస్తున్నా పట్టని అటవీ అధికారులు

అధికారుల పర్యవేక్షణ లోపం

కళావిహీనంగా దర్శనమిస్తున్న పార్కు

కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా

(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల) 

అడవులను అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపయోగపడే లా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు. పథకాలు ప్రవేశ పెట్టినప్పుడు చూపే శ్రద్ధ వాటిని పర్యవేక్షించడంలో కానరావడం లేదు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. మందమర్రి మండలం బొక్కలగుట్టలో అటవీ ప్రాంతం, గాంధారి మైసమ్మ ఆలయం ఉండటంతో క్రమంగా పర్యాటక ప్రాంతంగా రూపొందింది. దీంతో అక్కడ పార్కు జింకల పున రావాస కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆహ్లాదక రంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంచి ర్యాల-చంద్రాపూర్‌ జాతీయ రహదారిని ఆనుకొని బొక్కలగుట్ట గాంధారి పార్కు ఎదురుగా  రూ.2 కోట్ల వ్యయంతో జింకల పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. 2017 జూలై 28న అప్పటి అటవీ, పర్యావ రణశాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు.  అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన జింకలను అందులో వదిలిపెట్టారు.  


కుంటుపడిన అభివృద్ధి

అధికారులు పట్టించుకోకపోవడంతో జింకల పునరా వాస కేంద్రం అభివృద్ది కుంటుపడింది. కొంతకాలం  జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాలకు చెందిన ప్రజలు సైతం ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేం దుకు తరలివచ్చేవారు. ఆషాడమాసం ఆరంభంలో ఇక్కడి ఆలయం వద్ద మైసమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. దీంతో ప్రజల తాకిడి పెరిగి పర్యా టక కేంద్రంగా పేరు గడించింది. అనంతరం అధికా రుల నిర్లక్ష్యం కారణంగా పునరావాస కేంద్రం  పర్యవే క్షణ కొరవడి అందవిహీనంగా తయారైంది. ప్రధాన ద్వారం వద్ద పిచ్చిమొక్కలతో నిండిపోయింది.  ప్రస్తు తం పునరావాస కేంద్రంలో జింకలు ఆవాసం ఉం డగా, వాటి ఆలనాపాలన చూసే వారు కరువయ్యారు. 


కూలిన ప్రహరీ

పునరావాస కేంద్రం చుట్టూ జింకల రక్షణ కోసం బండరాయితో ప్రహరీని నిర్మించారు. ఈ యేడు కురి సిన వర్షాల కారణంగా జాతీయ రహదారి వైపు ప్రహరీ దాదాపు 30 మీటర్ల మేర కూలిపోయింది. దానిపై ఏర్పాటు చేసిన కంచె కూడా నేల మట్టంకాగా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రహరీ కూలిపోవడంతో జింకలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింకలు పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే గాకుండా వీధి కుక్కలు, ఇతర వన్య మృగాలు లోనికి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో జింకలకు ముప్పు వాటిల్లే  అవకాశం ఉంది. అక్టోబరులో హాజీపూర్‌ మండలం ముల్కల్ల  సమీపంలోని అటవీ ప్రాంతం లో పశువులపై పెద్దపులి దాడిచేసింది. అదే అడవి బొక్కల గుట్టవైపు కూడా వ్యాపించి ఉండటంతో పులి జింకల పునరావాస కేంద్రం వైపు వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గోడ కూలిన చోట అధికారులు ముళ్ల కంపలు అడ్డువేసి చేతులు దులుపుకున్నారు. ప్రహరీ నిర్మాణం వీలుకాని పక్షంలో కనీసం కంచెనైనా ఏర్పాటు చేయాల్సిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 


జింకలు సురక్షితం

వినయ్‌కుమార్‌ సాహు, ఎఫ్‌డీవో

పునరావాస కేంద్రంలో జింకలు సురక్షితంగా ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నాయన్న లెక్క తీయాల్సి ఉంది. వన్యప్రాణుల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వన్య ప్రాణుల దాహం తీర్చేందుకు ఇటీవల నీటి గుంతలు ఏర్పాటు చేయ డం జరిగింది. పెద్దపులి అలజడితో సిబ్బంది దృష్టి సారించారు. పునరావాస కేంద్రంలో పనులు కొంత పెండింగులో ఉన్నాయి. త్వరలో జంతువుల లెక్కలు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. 



Updated Date - 2020-12-04T04:17:49+05:30 IST