Smriti Irani : విదేశీ డిగ్రీని స్వదేశీ సంప్రదాయంతో స్వీకరించిన స్మృతి ఇరానీ తనయుడు

ABN , First Publish Date - 2022-07-22T01:05:47+05:30 IST

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తనయుడు జొహ్ర్ ఇరానీ

Smriti Irani : విదేశీ డిగ్రీని స్వదేశీ సంప్రదాయంతో స్వీకరించిన స్మృతి ఇరానీ తనయుడు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తనయుడు జొహ్ర్ ఇరానీ (Zohr Irani) విదేశీ డిగ్రీని స్వదేశీ సంప్రదాయంలో అందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ స్వీకరించారు. ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు ఆమె  అమితానందం వ్యక్తం చేశారు. ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 


స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసి, తాను అమితానందంలో ఓలలాడుతున్నానని పేర్కొన్నారు. ‘‘జొహ్ర్! నేటి నీ గ్రాడ్యుయేషన్ నువ్వు నీ సామర్థ్యానికి తగినట్లుగా జీవించడానికి, నీ కలల సాకారానికి ప్రయత్నించడానికి, బాధ్యతాయుతంగా జీవించడానికి, ప్రేమించడానికి, నువ్వు నీలాగా ఉండటానికి, కేవలం నీలాగా ఉండటానికి నూతన అవకాశాలకు నాందీ వాచకాలకు సంకేతం. నేను గర్వపడుతున్నాను, నేను అమితానందంలో ఓలలాడుతున్నాను. నిన్నెంతో ప్రేమిస్తున్నాను, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు. 


ఈ పోస్ట్ పెట్టిన వెంటనే వైరల్ అయింది. అనేక మంది సెలబ్రిటీలు, అభిమానులు జొహ్ర్ ఇరానీపై అభినందనల వర్షం కురిపించారు. విక్రాంత్ మెస్సీ, అమిత్ సాధ్, తుషార్ కపూర్ వంటి నటులు కూడా ఆయనను అభినందించారు. 


స్మృతి ఇరానీ, జుబిన్ ఇరానీ దంపతులకు జొహ్ర్ ఇరానీ (కుమారుడు), జోయిష్ ఇరానీ (కుమార్తె) ఉన్నారు. జుబిన్‌కు తొలి భార్య ద్వారా షనెల్లే అనే కుమార్తె కూడా ఉన్నారు. ఇటీవలే షనెల్లే వివాహ నిశ్చితార్థం జరిగింది. 




Updated Date - 2022-07-22T01:05:47+05:30 IST