Zomato Pro Plus : జొమాటో కీలక నిర్ణయం.. ఇకపై కస్టమర్లకు..

ABN , First Publish Date - 2022-08-22T23:05:00+05:30 IST

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato)లో మీకు ‘ప్రో ప్లస్’(Zomato Pro Plus) మెంబర్‌షిప్ ఉందా? తద్వారా అదనపు ప్రయోజనాలు పొందుతున్నారా ?..

Zomato Pro Plus : జొమాటో కీలక నిర్ణయం.. ఇకపై కస్టమర్లకు..

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato)లో మీకు ‘ప్రో ప్లస్’(Zomato Pro Plus) మెంబర్‌షిప్ ఉందా? ఎంచక్కా అదనపు ప్రయోజనాలు పొందుతున్నారా ?.. అయితే మీకు కాస్త నిరాశ తప్పదమో. ఎందుకంటే.. ‘ జొమాటో ప్రో’ (Zomato Pro) మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ముగింపు పలికింది. ప్రో మెంబర్‌షిప్ కోసం కొత్త సైన్ అప్‌లతోపాటు రెన్యూవల్స్‌ను కూడా నిలిపివేసింది. దీనిపై కస్టమర్లు సందేహాలు వెలిబుచ్చగా.. ట్విటర్ వేదికగా జొమాటో స్పందించింది. ‘‘ కొత్త ప్రయత్నంతో మీ ముందుకు రాబోతున్నందున జొమాటో ప్రో ప్లస్ మీకు అందుబాటులో లేదు. మెంబర్‌షిప్ పొడగింపు కూడా వీలుపడదు. త్వరలోనే అప్‌‌డేట్ ఇస్తాం. జొమాటో ప్రో ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు. మరింత మెరుగైన సేవలు అందిందే ప్రోగ్రామ్‌తో మీ ముందుకొస్తాం. తాజా సమాచారం కోసం జొమాటో యాప్ చూస్తూ ఉండండి. మీకేమైనా అభ్యంతరాలుంటే మా దృష్టికి తీసుకురావొచ్చు. వాటిని సంతోషంగా స్వీకరిస్తాం’’ అని జొమాటో ప్రో ట్విటర్ అఫీషియల్ హ్యాండిల్‌లో ప్రకటన చేసింది. కాగా జొమాటో ప్రో ప్లస్ మెంబర్‌షిప్‌ ద్వారా కస్టమర్లు వేగంగా ఫుడ్ డెలివరీ తోపాటు డిస్కౌంట్ల రూపంలో పెద్ద మొత్తంలో సేవింగ్స్‌కు అవకాశం ఉంటుంది. 


యాక్టివ్ మెంబర్లకు మాత్రమే..

ఓ జాతీయ మీడియా సంస్థకు జొమాటో ప్రతినిధి ఒకరు మరిన్ని వివరాలు వెల్లడించారు. కొత్త ప్రోగ్రామ్‌కు సంబంధించి తమ కస్టమర్లు, రెస్టారెంట్ భాగస్వాముల నుంచి సలహాలు-సూచనలు స్వీకరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి జొమాటో ప్రో, ప్రో ప్లస్ ప్రోగ్రామ్‌లలోకి కొత్త మెంబర్లు, మర్చంట్ పార్టనర్లకు అవకాశం ఉండబోదన్నారు. అయితే ఇప్పటికే ఉన్న యాక్టివ్ యూజర్లు తమ ప్రయోజనాలు పొందొచ్చని, వారి వరకు మాత్రమే ప్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే మెంబర్‌షిప్ కాలపరిమితి ముగిశాక పొడిగింపు కూడా సాధ్యపడదని స్పష్టం చేశారు. కాగా జొమాటో నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా కస్టమర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.


మరోవైపు ఎప్పటిలోగా అప్‌డేట్ ఇస్తారని కస్టమర్లు, రెస్టారెంట్ పార్టనర్లు ప్రశ్నించిగా... కాలపరిమితి చెప్పలేమని జొమాటో బదులిచ్చింది. అయితే వీలైనంత త్వరగా కస్టమర్ల ముందుకొస్తామని హామీ ఇచ్చింది. కాగా ప్రో ప్లస్ మెంబర్‌షిప్ ఎత్తివేతకు సంబంధించి జొమాటో ఇదివరకే సంకేతాలిచ్చింది. తాజాగా కస్టమర్ల సందేహాల నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పష్టత ఇచ్చింది. కాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన యాడ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో వార్తల్ ఈ మధ్య వార్తల్లో నిలిచిన ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో(Zomato)  నిలుస్తోంది. సంస్థకు సంబంధించి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన  కీలకమైన నిర్ణయం తీసుకుంది.





Updated Date - 2022-08-22T23:05:00+05:30 IST