అందరి భాగస్వామ్యంతోనే మండలాభివృద్ది

ABN , First Publish Date - 2022-05-14T04:32:30+05:30 IST

అందరి భాగస్వామ్యం తోనే మండలాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ డుబ్బులనానయ్య అధ్యక్షతన మండలసర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

అందరి భాగస్వామ్యంతోనే మండలాభివృద్ది
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

- సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

చింతలమానేపల్లి, మే 13: అందరి భాగస్వామ్యం తోనే మండలాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ డుబ్బులనానయ్య అధ్యక్షతన మండలసర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మండలంలోని పలుగ్రామాలకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అలాగే మండలంలో నెలకొన్న సమస్యల పట్ల అధికా రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగు నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖ అధికారులు పనుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని వెంటనే పనులను చేపట్టాలని సూచించారు. బాబాసాగర్‌ గ్రామంలో ట్రాన్స్‌ఫారం ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందని, క్షేత్రస్థాయిలో పనిచేయని అధికారులు అవసరం లేదని అసహనం వ్యక్తం చేశారు. వారిపైౖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అంతకంటే ముందు అధికారుల పనితీరుపై పలు వురు సభ్యులు అసహనం వ్యక్తంచేశారు. కార్యక్ర మంలో జడ్పిటీసీ డుబ్బుల శ్రీదేవి, తహసీల్దార్‌ మునావర్‌ షరీప్‌, ఎంపీడీవో మహేందర్‌, ఎంపీవో సుధాకర్‌ రెడ్డి, వైస్‌ఎంపీపీ మనోజిత్‌, కోఆప్షన్‌ సభ్యుడు నాజీమ్‌హుస్సేన్‌, ఏవో రాజేష్‌, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.

నాగమ్మ చెరువును పర్యాటకకేంద్రంగా మారుస్తాం

సిర్పూరు(టి): మండలకేంద్రంలోని నాగమ్మ చెరు వును పర్యాటకకేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే కోనేరుకోనప్ప అన్నారు. శుక్రవారం నాగమ్మ చెరువులో ఏర్పాటు చేస్తున్న బుద్ధుడి విగ్రహ పనులను ఆయన పరిశీలించారు. అనంతరంమాట్లాడుతూ సిర్పూరు(టి)  నాగమ్మ చెరువుకు కొత్తశోభ తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర-సిర్పూరు (టి)కి అనుసంధానంగా ఉన్న నాగమ్మ చెరువుకి ప్రత్యేక కళ తెచ్చేందుకు బుద్ధుడి విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వర్షాకాలం లోపే విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఉపసర్పంచి తోటమహేష్‌, తుకారం, తదితరులు ఉన్నారు.

Read more