ముగిసిన మండల స్థాయి క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-01-26T05:05:24+05:30 IST

దేవీపురంలోని డాన్‌బాస్కో స్కూల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి.

ముగిసిన మండల స్థాయి క్రికెట్‌ పోటీలు
విజేతలతో సబ్‌ రిజిస్ట్రార్‌ నిరంజన్‌కుమార్‌ తదితరులు

 విన్నర్‌ మర్రిపాలెం, రన్నరప్‌ పల్లవానిపాలెం జట్లు

సబ్బవరం, జనవరి 25 : దేవీపురంలోని డాన్‌బాస్కో స్కూల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్‌ పోటీలు మంగళవారంతో ముగిశాయి. విన్నర్‌గా మర్రిపాలెం, రన్నరప్‌గా పల్లవానిపాలెం జట్లు నిలిచాయి. విజేతలకు స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ నిరంజన్‌కుమార్‌ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాలిభీమవరం సర్పంచ్‌ గొర్లి రాజేశ్‌, రెవ అనీతోటం, డాన్‌బాస్కో నవజీవన్‌ విశాఖపట్నం డైరెక్టర్‌ రెవ ఫాదర్‌ బాలశౌరి, రెవ ఫాదర్‌ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T05:05:24+05:30 IST