Advertisement

అంతర్జాతీయ కరాటే పోటీల్లో మండలవాసి ప్రతిభ

Mar 1 2021 @ 23:53PM
జాతీయజెండాతో నవనీత

మదనాపురం, మార్చి 1:  అంతర్జాతీయ క రాటే పోటీల్లో మండల వాసి ప్రతిభ చూపి బంగారు పతకం సాధించింది. మండలంలోని అజ్జకొల్లు గ్రామానికి చెందిన నవనీత ఈనెల 24,25,26,27,28 తేదీల్లో నేపాల్‌ దేశంలోని పొక్ర నగరంలో నేపాల్‌ యూత్‌ స్పోర్స్ట్‌ డెవ లప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో ఇండో- నేపాల్‌ అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించారు. బాలికల అండర్‌ -17,50 కేజీల విభాగంలో  నవనీత  పాల్గొని నేపాల్‌ దేశానికి చెందిన కరాటే క్రీడాకారిణీతో   తలపడి బంగారు పతకం సాధించింది. అంతే  కాకుండా సౌత్‌ ఇండియా బెస్ట్‌ ఫైటర్‌గా ఎం పికైంది. గ్రామస్థాయి విద్యార్థినికి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించే విధంగా ఉత్తమ శిక్షణ ఇచ్చిన టైగర్‌ బ్రూస్‌లీ మా ర్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివయాదవ్‌ను బెస్ట్‌ ట్రైనర్‌గా ఎంపిక చేసి సన్మానించారు.

Follow Us on:
Advertisement