పులి మీద చేయి పెట్టి ప్రేమతో నిమిరిన జూకీపర్.. పాపం చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేదు..

Published: Fri, 17 Jun 2022 21:26:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పులి మీద చేయి పెట్టి ప్రేమతో నిమిరిన జూకీపర్.. పాపం చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేదు..

క్రూర జంతువుల ఆలనాపాలనా చూసుకునే వారికి.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి. అప్పటిదాకా శాంతంగా ఉండే జంతువులు.. ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటాయి. అలాంటి సమయాల్లో కేర్ టేకర్లు వాటికి బలవుతుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. మెక్సికోలో ఇలాగే జరిగింది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న పులిని.. జూకీపర్ పరామర్శించేందుకు వెళ్లాడు. ఆ సమయంలో పులి మీద ప్రేమతో చేయి పెట్టి నిమిరాడు. అయితే చివరకు అలా జరుగుతుందని అతను ఊహించలేకపోయాడు.

పశ్చిమ మెక్సికోలోని పెరిబన్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తి.. ప్రభుత్వ అనుమతితో జంతు ప్రదర్శనశాలను నిర్వహిస్తున్నాడు. అందులో జోస్ అనే వ్యక్తి జూకీపర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం యథావిదిగా అన్ని జంతువులకు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ క్రమంలో పులి బోను వద్దకు వెళ్లి పరమర్శిస్తున్నాడు. ఆ సమయంలో పులి శాంతంగా ఉంది. దీంతో జోసస్.. ఇనుప కంచె మధ్యలో నుంచి చేయి లోపలికి పెట్టి, పులిని ప్రేమతో నిమిరే ప్రయత్నం చేశాడు.

కారులో వెళ్తున్న ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి మరీ ఈ ఎలుగుబంటి చేసిన పనికి అంతా ఫిదా.. ఏకంగా 17 మిలియన్ల వ్యూస్

మొదట శాంతంగా ఉన్న పులి.. మెడ మీద చేయి వేసి చిన్నగా తట్టగానే ఒక్కసారిగా అతడి చేయిని పట్టుకుంటుంది. ఎంత ప్రయత్నించినా చేయి మాత్రం వదలదు. గట్టిగా కొరకడంతో తీవ్ర అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మధుమేహం కారణంగా పరిస్థితి విషమంగా మారుతుంది. ఇదే విషయాన్ని వైద్యులు అతడికి తెలియజేయడంతో.. గుండెపోటుతో మరణించాడు. 

నాతోనే తమాషా.. వెకిలి చేష్టలు చేసిన యువకుడికి చుక్కలు చూపించిన గొరిల్లా..

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.