జూమ్ యాప్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2021-12-07T03:58:03+05:30 IST

జూమ్ యాప్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం అయింది. రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. ఢిల్లీలో..

జూమ్ యాప్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం

హైదరాబాద్: జూమ్ యాప్‌లో కాంగ్రెస్‌ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం అయింది.  రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. ఢిల్లీలో వరి నిరసన దీక్ష అవసరం లేదని మెజారిటీ నేతలు పీఏసీలో అభిప్రాయం వ్యక్తం చేశారు. పసుపు, మిర్చిపై ఢిల్లీ స్థాయిలో నిరసనలు చేయాలని కొందరు నాయకులు పీఏసీ దృష్టికి తెచ్చారు. రైతు సమస్యలపై అధ్యయనం చేసేందుకు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంటల వారీగా అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నివేదిక సిద్ధం చేయాలని పీఏసీ నిర్ణయించింది. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరికి కమిటీలో స్థానం కల్పించారు. వరికి ప్రత్యామ్నాయంగా పంటలసాగుపై అధ్యయనం కోసం చత్తీస్‌గఢ్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ బృందం  వెళ్లనుంది. చిరు ధాన్యాల సాగు ద్వారా అక్కడ రైతులు లబ్దిపొందుతున్నఅంశంపై అధ్యయనం చేయనుంది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలు జరిగితే...సహించరాదని సీనియర్‌ నేత హనుమంతురావు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 10వ తేదీన క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. 

Updated Date - 2021-12-07T03:58:03+05:30 IST