బోనమెత్తుకున్న సునీతారెడ్డి
వికారాబాద్, జనవరి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన ఊరడమ్మ ఉత్సవాలకు జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి హాజరయ్యారు. ఆమెకు గ్రామస్థులు స్వాగతం పలికారు. సునీతారెడ్డి బోనమెత్తుకుని ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లమ్మ, ఉపసర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.