సమస్యలపై గళం

ABN , First Publish Date - 2021-03-06T05:55:47+05:30 IST

సమావేశంలో సమస్యలపై సభ్యులు గళం విప్పారు

సమస్యలపై గళం
సిరిసిల్లలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

- జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సమస్యలపై నిలదీత
- మిషన్‌భగీరథ నీళ్లు అందడం లేదని సభ్యుల ప్రస్తావన
- వైకుంఠధామాలకు కరెంట్‌ ఇవ్వాలని డమాండ్‌
- రైతుబంధు చెక్కులు తమ ద్వారా అందించాలని సూచన
- ప్రోటోకాల్‌ పాటించడం లేదని జడ్పీటీసీలు, ఎంపీపీల ఆవేదన

సిరిసిల్ల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సమావేశంలో సమస్యలపై సభ్యులు గళం విప్పారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించడం లేదని, తమకు విలువే లేకుండా పోయిందని ఎంపీపీలు అవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల పరిస్థితి మరి దారుణంగా మారిందని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. అధికారులు మండలానికి వచ్చిన సందర్భాల్లో సమాచారం ఇవ్వకపోవడంపై జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రశ్నించారు.   వేములవాడ రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ 17 గ్రామాలు హైమాస్‌ లైట్లు ఏర్పాటు చేశారని కనీసం ఎవరూ అడిగారు, ఏ నిదులతో ఏర్పాటు చేశారనే సమాచారం కూడా మండల పరిషత్‌కు ఇవ్వడం లేదని అన్నారు. ఇల్లంతకుంట ఎంపీపీ వూట్కూరి వెంకటరమణారెడ్డి మాట్లాడు తూ ఎంపీపీల పరిస్థితి అందరిది ఒకేలాగా ఉందని కనీసం సమాచారం కూడా ఉండడం లేదని అవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ మనది మనమే అనుకుంటే ఏట్లా అంటూ సర్ధిచెపుతూ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని.  ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని అదేశించారు. జిల్లా పంచాయతీ శాఖ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ ప్రొటోకాల్‌ సమస్య ఉందని సంబంధిత పనులు చేసే ఇంజనీరింగ్‌ శాఖనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

భగీరథ నీళ్లు లేవు...
మిషన్‌భగీరథ నీటి సమస్యలపై ప్రతి సమావేశంలో చెబుతూనే ఉన్నామని సమస్యలు తీరడం లేదని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎల్లారెడ్డి పేట జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలో ఏడు రోజులుగా మిషన్‌భగీరథనీళ్లు రావడం లేదని అన్నారు. మార్చిలోనే ఈ పరిస్థితి ఉంటే ఎండాకాలంలో ఏలా ఉంటుందని ప్రశ్నించారు. ట్యాంకర్లు పెట్టుకునే వీలు లేదని బోర్లు కూడా వేసుకోలేని క్రమంలో నీళ్లు సక్రమంగా ఇవ్వాలని అన్నారు. ఎల్లారెడ్డిపేటలో ట్యాంక్‌ నింపడానికి 12 గంటల సమయం పడుతుందని సంప్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. మిషన్‌భగీరథ ఈఈ జానకి గ్రిడ్‌ మరమ్మత్తుల వల్ల నీటి సమస్య వచ్చిందని పేర్కొన్నారు. మిషన్‌భగీరథ సమస్యలపై చర్చించారు. రుద్రంగి ఎంపీపీ స్వరూపరాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, వేములవాడరూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం, మిషన్‌భగీరథ పైపులైన్ల కోసం సీసీ రోడ్లను తవ్వి సిమెంట్‌ వేయకుండా నే వదిలేశారని, వేసిన చోట నాణ్యతగా వేయలేదని అన్నారు. రుద్రంగిలో మిషన్‌భగీరథ నీరు ట్యాంకు నుండి వృదాగా పోతున్న పట్టించుకోవడం లేదని స్వరూపరాణి అన్నారు.

సమస్యలపై సుదీర్ఘ చర్చ..
జిల్లాలోని మండలాల్లోని సమస్యలపై శాఖల వారీగా జడ్పీటీసీలు, ఎంపీపీలు సుదీర్ఘంగా చర్చించారు. 37 శాఖలకు సంబంధించిన నివేదికలపై అధికారులు, అందించిన అంశాలపై చర్చించారు. జడ్పీ కో అప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేటలో షాదీఖానా నిర్మించిన కొన్ని పనులు మిగిలిపోవడంతో ప్రారంభించుకోలేక పోతున్నామని పనులను పూర్తి చేయాలని కోరారు. ఇల్లంతకుంట ఎంపీపీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అనంతగిరి, మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లు ఉన్న ఇల్లంతకుంటలో భూగర్భ జలాలు పెరిగాయని ఉపాధి హామీ కింద బావులు తవ్వుకోవడానికి ఇతర మండలాల నుంచి వచ్చే వారికి కూడా డబ్బులు చెల్లించే విధంగా పరిశీలించాలని అన్నారు. చెరువు కట్టలపై మొలిచిన చెట్లను ఉపాధి హామీ కూలీలతో తొలగించడం సాధ్యంకాదని మిషనరీని ఉపయోగించే విధంగా పరిశీలించాలని అన్నారు. డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి ఉపాధిహామీ పథకంలో మిషన్‌ను ఉపయోగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. చందుర్తి ఎంపీపీ లావణ్య మాట్లాడుతూ నర్సింగాపూర్‌ను రెవెన్యూ గ్రామంగా మార్చాలని కోరారు. ఎంపీపీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉద్యానవన శాఖ అధికారులు మండలాల్లోకి వచ్చి పథకాలపై అవగాహన కల్పించాలని మండల పరిషత్‌ సమావేశాలకు రావడం లేదని అన్నారు. రేండేళ్ల క్రితం డ్రిప్‌ ఇరిగేషన్‌ మంజూరైన ఇవ్వడం లేదని అన్నారు. ఉద్యానవన అధికారి శ్రీవాణి మాట్లాడుతూ ఉద్యానవన శాఖలో సిబ్బంది కొరత ఉందని ఇద్దరే ఉండడంతో ఇబ్బంది కలుగుతుందని అన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని పరిష్కరిస్తామని తెలిపారు.

రైతుభీమా చెక్కులు పంపిణీ చేస్తాం
రైతు భీమా పథకం ద్వారా బాధిత కుటుంబానికి అందించే చెక్కులను ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేసే అవకాశం పరిశీలించాలని తంగళ్లపల్లి ఎంపీపీ మానస, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌ కోరారు. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇస్తే ప్రభుత్వం ద్వారా అందిన విషయం తెలుస్తుందని అన్నారు. వ్యవసాయ అధికారి రణధీర్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసీ నుంచి నేరుగా రైతు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి  నేరుగా డబ్బులు చేరుతున్నాయని చెప్పారు.  రైతు బంధు సమితి కో ఆర్డీనేటర్‌ గడ్డం నర్సయ్య మాట్లాడుతూ ప్రొసిడింగ్‌ను ప్రజాప్రతినిధుల ద్వారా అందించే విషయం పరిశీలించాలని అన్నారు. రుద్రంగి ఎంపీపీ స్వరూపరాణి మాట్లాడుతూ రుద్రంగిలో రోడ్డు నిర్మాణంలో డీవైడర్లు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.  అర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ ద్వారా రోడ్డు పనులు జరుగుతున్నాయని వారికి తేలియజేస్తానని చెప్పారు. వేరే శాఖ ద్వారా పనులు జరిగినపుడు తమకు సమాచారం ఇస్తే పరిశీలించే వీలవుతుందని అన్నారు. ముస్తాబాద్‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ వైకుంఠ ధామాలకు కరెంట్‌ సౌకర్యాం కల్పించాలని కోరారు. వీర్నపల్లి జడ్పీటీసీ కళావతి మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. అనంరతం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ పెండింగ్‌ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రారంభోత్స వాల సమయంలో అధికారులు ఫ్రోటోకాల్‌ విధిగా పాటించాలని సూచించా రు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు అంజయ్య, సత్యప్రసాద్‌, శిక్షణ కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమాచారం ఇవ్వడం లేదు..
- గంగం స్వరూపరాణి, రుద్రంగి ఎంపీపీ
గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడంకానీ సమాచారం కానీ ఇవ్వడం లేదు. అధికారులు నేరుగా సర్పంచ్‌లకే సమాచారం ఇస్తున్నారు. మమ్మలను పట్టించుకోవ డం లేదు. ఎంపీపీలకు నిధులు లేకపోవడమే ఈ పరిస్థితికి కార ణం. కొన్ని పనులు చేపట్టడానికి సర్పంచ్‌ల నుంచి తీర్మానాలు అడిగితే ఇవ్వలేదు. నిధులు వెనక్కి వెళ్లడం ఇష్టం లేని పరిస్థితుల్లో సర్పంచ్‌లకే పనులు అప్పగించాం.

Updated Date - 2021-03-06T05:55:47+05:30 IST