ఏపీలో చప్పగా స్థానిక ఎన్నికల కౌంటింగ్ సందడి

Sep 19 2021 @ 11:55AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల కౌంటింగ్ సందడి ఎక్కడ కనిపించడంలేదు. ఫలితాలపై ప్రజలు ఆసక్తి చూపడంలేదు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల కోసం వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాగే వ్యవహరించింది. దీంతో పోటీపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కోర్టు గొడవలతో ఐదు నెలల తర్వాత ఇవాళ కౌంటింగ్ జరుగుతోంది. అసలు కౌంటింగ్ జరుగుతుందనే విషయాన్ని జనాలు పెద్దగా పట్టించుకోవడంలేదు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.