ఈ క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్..మే 1 నుంచి చార్జీలు వసూలు

అనేక యుటిలిటీ బిల్లుల కోసం ప్రస్తుతం క్రెడిట్ కార్డు వాడకం సాధారణమైపోయింది

రివార్డులు వస్తున్నాయని ఎక్కువ మంది వీటికే మొగ్గుచూపారు

కానీ పలు బ్యాంకులు ఇప్పుడు రివార్డులకు బదులు సర్వీస్ చార్జ్ వసూలు చేస్తున్నారు

Yes Bank, IDFC Bank మే 1 నుంచి యుటిలిటీ బిల్లులపై 1% అదనంగా ఛార్జ్ చేయనున్నాయి

Yes Bankలో ఈ లిమిట్ రూ. 15వేలు ఉంటే, IDFC Bankలో రూ. 20 వేలుగా ఉంది

అంటే ఈ లిమిట్ క్రాస్ అయితే వినియోగదారులు వన్ పర్సెంట్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది

యుటిలిటీ చెల్లింపులపై డిస్కౌంట్ రేట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులకు తక్కువ ఆదాయం వస్తుంది

వాటిని భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు స్పెషల్‌గా ఈ చార్జీలు వసూలు చేస్తున్నాయి