కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

బ్లడ్ షుగర్‌ని నియంత్రించడంలో కాకరకాయ సహయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

కాకరలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్ వంటి అవసరమైన విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంది. 

బరువు తగ్గడంలోనూ కాకరకాయ రసం పనిచేస్తుంది. ఇందులోని కేలరీలు తక్కువగా ఉంటాయి. 

కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పొట్లకాయ రసంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కాలేయ ఆరోగ్యానికి కాకరకాయ పనిచేస్తుంది. 

చర్మ ఆరోగ్యాన్ని కాకరకాయ పెంచుతుంది. ఇది మొటిమలు రాకుండా కాపాడుతుంది.