బీపీ పెషెంట్లు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే.. సేఫ్ గా ఉండొచ్చట!

అధిక రక్తపోటు చాలా సాధారణ విషయం. కానీ ఇది గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.

 బీపీ  ఉన్నవారు తెలిసి తెలియక ఆహారంలో ఉప్పు తీసుకునే విషయంలో పొరపాటు చేస్తుంటారు.  

అధిక రక్తపోటు సమస్య నుండి బయట పడాలి అంటే  ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి.

ఆహారంలో సోడియం కంటెంట్ తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.

రోజుకు 1500 నుండి 2000 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోకూడదు.

ఆహారం ద్వారా ఎక్కువ ఉప్పు శరీరంలోకి వెళితే రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరుగుతుంది.

బీపీ పేషెంట్లు ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే  సుమారు 40శాతం అధిక బీపీ ప్రమాదాన్ని తగ్గించవచ్చట.