వేసవిలో కూల్ వాటర్ తెగ తాగేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు ఆ జోలికే పోరు..!

వేడి వాతావరణం నుండి ఒక్కసారిగా ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ తెరిచి చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హాని కలుగుతుందనే విషయం తెలుసా..!

వేసవిలో చల్లటి నీటిని తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి.

చల్లటి నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, అసౌకర్యం ఉంటుంది.

కూల్ వాటర్ తీసుకోవడం వల్ల చికాకుతో పాటు గొంతు నొప్పి కూడా ఉంటుంది.

చల్లనీరు శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను తగ్గిస్తుంది.

అతిగా చల్లని నీరు తీసుకోవడం వల్ల మైగ్రేన్, తలనొప్పి వస్తాయి. 

కండరాల తిమ్మరి, షాక్ వంటి ఇబ్బందులు చల్లని నీటిని తీసుకోవడం వల్ల కనిపిస్తాయి. 

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగినవారు చల్లని నీటిని తీసుకోవడం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.