స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే..  ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!

సంతానలేమి సమస్యకు వీర్యకణాల సంఖ్య తగ్గడమే కారణం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఫుడ్స్ తీసుకుంటే ఎంతో మంచిది.

బెర్రీస్: స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్‌లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచడంలో తోడ్పడుతాయి.

డార్క్ చాక్లెట్: ఇది అమైనో యాసిడ్స్, ఎల్ ఆర్జినైన్‌కి గొప్ప మూలం. ఈ డార్క్ చాక్లెట్స్ రెగ్యులర్‌గా తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

అవకాడో: వీటిల్లో హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, జింక్ వంటి పోషకాలుంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచడంలో తోడ్పడుతాయి.

గుడ్లు: వీటిల్లో విటమిన్ ఈ, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ స్పెర్మ్‌ని ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి.

పాలకూర: పాలకూరలో ఉండే ఫోలేట్, బి విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలు.. స్మెర్మ్ కౌంట్‌ని గణనీయంగా పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

వాల్‌నట్స్: వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గుమ్మడి గింజలు: ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్.. స్మెర్మ్ ఉత్పత్తికి తోడ్పడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

గుల్లలు: వీటిని ఓయిస్టర్ అంటారు. సముద్రంలో దొరికే ఈ గుల్లలు తింటే.. స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.