రాత్రి 7గంటలలోపు డిన్నర్ ఎందుకు చేయాలో చెప్పే బలమైన కారణాలివీ..!

ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉంటే తిన్న ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల రాత్రి సమయంలో కడుపు సంబంధ సమస్యలు లేకుండా హాయిగా నిద్ర పడుతుంది.

రాత్రి 7 గంటలలోపు తింటే ఆకలి వేళలు కూడా క్రమ పద్దతిలో ఉంటాయి. ఉదయాన్నే అల్పహారాన్ని స్కిప్ చేయకుండా ఉండటంలో సహాయపడుతుంది.

7గంటలలోపు తినడం వల్ల హడావిడి ఉండదు. నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు. దీనివల్ల తిన్న ఆహారం శరీరానికి ఒంటబడుతుంది.

7గంటలలోపు ఆహారం తినడం ద్వారా అది సరిగా జీర్ణం అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పేరుకుపోకుండా చేస్తుంది.

రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్ సిస్టమ్  సమన్వయంగా ఉంటుంది.

రాత్రి భోజనం 7 గంటలలోపు తింటే యాసిడ్ రిఫ్లక్స్, మలబద్దకం, జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలు ఉండవు.

రాత్రి సమయంలో 7గంటలలోపు తినడం వల్ల బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. జీవక్రియ  సహజంగా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది.