పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని  పండ్లు ఇవీ..!

పుచ్చకాయలను గది ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది. ఫ్రిజ్ లో ఉంచితే యాంటీఆక్సిడెంట్లు కోల్పోతాయి.

మామిడి పండ్లను మాగబెట్టడానికి ఇథిలీన్ ఆక్సైడ్ వాయువు వాడతారు. ఇలా పండిన మామిడి పండ్లను ఫ్రిజ్ లో ఉంచితే నల్లబడతాయి.

అవకాడోలు పక్వానికి వచ్చే వరకు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఆ తరువాత ఎక్కువరోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్ లో ఉంచవచ్చు.

దోసకాయలను ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఉండే నీటిశాతం కారణంగా మచ్చలు ఏర్పడి తొందరగా పాడవుతాయి.

పీచ్ పండ్లను ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఉండే తేమ శాతం తగ్గిపోతుంది.

ప్యాషన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ లను ఫ్రిజ్ లో ఉంచితే తేమ శాతం కోల్పోతాయి.

టమోటలను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే రుచి కోల్పోయి మెత్తగా మారతాయి. అలాగే నీటిశాతం కూడా తగ్గిపోతుంది.