ఇన్వెర్టర్ ఏసీ vs సాధారణ ఏసీ: రెండింటిలో ఏది ఉత్తమం?

ఏసీలోని ఇన్వర్టర్ టెక్నాలజీ.. ఎలక్ట్రిక్ వోల్టేజ్, విద్యుత్, ఫ్రీక్వెన్సీ కంట్రోలర్‌గా పని చేస్తుంది.  కంప్రెజర్‌కు అవసమైన మేర పవర్‌ను సరఫరా చేస్తుంది.

కంప్రెజర్, రూమ్ కూలింగ్‌పై ఇన్వర్టర్ ఏసీకి కంట్రోల్ ఉంటుంది. రూమ్ టెంపరేచర్ ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. 

ఇన్వర్టర్ ఏసీలో కంప్రెజర్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. పరిస్థితిని బట్టి అవసరమైనంత మేర కూలింగ్, హీటింగ్ చేయగలిగే విభిన్న స్పీడ్స్ గల కంప్రెజర్ ఇన్వర్టర్ ఏసీలో ఉంటుంది.

కంప్రెజర్‌కు ఎంత పవర్ అవసరమో అంతే సరఫరా అవుతుంది. అందువల్ల ఇన్వర్టర్ ఏసీ తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది. 

సాధారణ ఏసీల్లో ఒకే స్పీడ్ గల కంప్రెజర్ మోటార్ ఉంటుంది. ఇది అయితే ఒకే స్పీడ్‌లో రన్ కావడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. 

సెట్ చేసిన రూమ్ టెంపరేచర్‌కు రాగానే కంప్రెజర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. మళ్లీ ఉష్ణోగ్రత పెరిగినపుడు కంప్రెజర్ ఆన్ అవుతుంది. 

ఇలా కంప్రెజర్ తరచుగా ఆన్, ఆఫ్ కావడం వల్ల విద్యుత్తు వినియోగం ఎక్కువవుతుంది. ఫలితంగా కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది.

నాన్-ఇన్వర్టర్ ఏసీల కంటే ఇన్వర్టర్ ఏసీల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఏసీ వాడాలనుకునే వారు ఇన్వర్టర్‌ ఏసీ తీసుకోవడమే ఉత్తమం.

ఇన్వర్టర్ టెక్నాలజీ లేని ఏసీల నుంచి శబ్దం కూడా ఎక్కువగా వస్తుంది. వాటితో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీల శబ్దం చాలా తక్కువ.