బంగ్లాదేశ్‌లో కనిపించే ఈ 6 జంతువులు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బంగ్లాదేశ్ జాతీయ జంతువైన బెంగాల్ టైగర్ కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది. 

నేపాల్, బంగ్లాదేశ్ నదుల్లో ఎక్కువగా కనిపించే గంగానది డాల్పిన్.. అంతరించిపోనున్న జాబితాలో ఉంది. 

బంగ్లాదేశ్ అడవుల్లో రాత్రి వేళల్లో కనిపించే బెంగాల్ స్లో లోరిస్ జంతువులను ఔషధ తయారీ నిమిత్తం అక్రమవేట సాగిస్తున్నారు. 

ఆసియా ఏనుగుల జాతి మనుగడ కూడా ప్రశ్నార్థంగా మారింది. 

బంగ్లాదేశ్‌లో ఎక్కువగా కనిపించే హూలాక్ గిబ్బన్ అనే కోతి జాతి కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉంది.

బంగ్లాదేశ్ సహా దక్షిణాసియాలో కనిపించే బెంగాల్ ఫ్లోరికన్ అనే పక్షి జాతి కూడా అంతరించిపోతోంది.