ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!

ఏసీ  గాలి నుండి తేమ తొలగిస్తుంది. ఇది కళ్లు, చర్మం రెండింటిని పొడిగా మార్చి చికాకు కలిగిస్తుంది.

ఏసీ గాలి పొడిగా ఉంటుంది. ఇది శ్వాస కోశ వ్యవస్థను చికాకు పెడుతుంది. ముక్కులు రద్దీగా మారడం,  గొంతు పొడిబారడం, దగ్గు రావడం జరుగుతుంది.

ఎక్కువ కూలింగ్ వాతావరణంలో నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది.

బయటి ఉష్ణోగ్రతకు, ఏసీ ఉష్ణోగ్రతకు తేడా ఉంటుంది. ఇది శరీరానికి అసౌకర్యం అలసట కలిదిస్తుంది. తలనొప్పికి కారణం అవుతుంది.

చల్లని పొడిగాలి అలర్జీలు, ఉబ్బసం వంటి శ్వాసకోశ పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది.

ఏసీ పరిసరాలలో ఉన్నప్పుడు శరీరం తొందరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది.  అందుకే పుష్కలంగా నీరు తాగడం మంచిది.

ఏసీలు గాలిలో వ్యాపించే వ్యాధికారకాలను ట్రాప్ చేయగలవు. జలుబు, ఇతర అనారోగ్య ప్రాదాలను పెంచుతాయి.