కుల గణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కులగణనపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల మంటలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన సోషల్ జస్టిస్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 

కుల గ‌ణ‌న‌పై తాను రాజ‌కీయం చేయ‌డం లేద‌న్నారు. త‌న జీవితంలో అది టార్గెట్ అని, దాన్ని కాంగ్రెస్ వ‌ద‌ల‌బోదన్నారు. 

కుల గ‌ణ‌న‌ను అడ్డుకునే శ‌క్తి ఏదీలేద‌ని.. కాంగ్రెస్ స‌ర్కారు అధికారంలోకి రాగానే, తొలుత తాము కుల గ‌ణ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు రాహుల్ స్పష్టం చేశారు.

ఇది త‌న గ్యారెంటీ అని తెలిపారు. కుల గ‌ణ‌న అంటే కేవ‌లం కులాల స‌ర్వే కాదని, దానికి ఆర్థిక‌, వ్య‌వ‌స్థీకృత స‌ర్వేను కూడా క‌ల‌ప‌నున్న‌ట్లు అన్నారు. 

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని.. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఒకేసారి సర్వే చేపడతామని రాహుల్ వివరించారు.