Share News

తెలంగాణ మహిళలకు ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌.. అర్హతలు ఇవే..!

ABN , First Publish Date - 2023-10-16T17:19:44+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం (సీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యు, టీఎ్‌స)-మహిళలకు ఉద్దేశించిన ‘ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎ్‌ఫ)/ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి

తెలంగాణ మహిళలకు ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌.. అర్హతలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం (సీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యు, టీఎ్‌స)-మహిళలకు ఉద్దేశించిన ‘ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎ్‌ఫ)/ఏఎన్‌ఎం ట్రెయినింగ్‌’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో 180 సీట్లు, ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో 840 సీట్లు చొప్పున మొత్తం 1,020 సీట్లు ఉన్నాయి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో మేనేజ్‌మెంట్‌ సీట్లు లేవు. ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో 40 శాతం మేనేజ్‌మెంట్‌ సీట్లు ఉన్నాయి.

గవర్నమెంట్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు-సీట్లు

ఆర్టీసీ(ఎఫ్‌) నిలోఫర్‌ హెల్త్‌ స్కూల్‌, హైదరాబాద్‌ - 40 సీట్లు

గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌ -40 సీట్లు

ఎంజీఎం హాస్పిటల్‌, వరంగల్‌ - 20 సీట్లు

గవర్నమెంట్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఖమ్మం - 40 సీట్లు

గవర్నమెంట్‌ ట్రైబల్‌ ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్‌) ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కొత్తగూడెం(భద్రాద్రి) - 40 సీట్లు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.

రిజిస్ట్రేషన్‌ పీజు: రూ.200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 20

దరఖాస్తు హార్డ్‌ కాపీని గవర్నమెంట్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు/డీఎంహెచ్‌ఓలకు అందించేందుకు చివరి తేదీ: అక్టోబరు 21

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు చివరి తేదీ: అక్టోబరు 31

ప్రోగ్రామ్‌ ప్రారంభం: నవంబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: www.chfw.telangana.gov.in

Updated Date - 2023-10-16T17:19:44+05:30 IST