Share News

Pune: లోయలో పడిన ఆల్కాహాల్ ట్యాంకర్...ఇద్దరి మృతి

ABN , Publish Date - May 09 , 2023 | 08:39 AM

అల్కాహాలుతో వెళుతున్న ట్యాంకర్ సోమవారం రాత్రి లోయలో పడిన ఘటనలో ఇద్దరు మరణించారు...

 Pune: లోయలో పడిన ఆల్కాహాల్ ట్యాంకర్...ఇద్దరి మృతి
Alcohol Tanker rolls down gorge

పూణే(మహారాష్ట్ర): అల్కాహాలుతో వెళుతున్న ట్యాంకర్ సోమవారం రాత్రి లోయలో పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. (Alcohol Tanker rolls down gorge)పూణె ( Pune)నగరంలోని హదప్సర్ పారిశ్రామిక ప్రాంతానికి అల్కాహాలు ట్యాంకర్ వెళుతూ బైక్‌లను ఢీకొని వాగులో బోల్తా పడింది.ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. దివ్ ఘాట్ కొండ సెక్షన్ వద్ద సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదానికి బ్రేకు వైఫల్యమే ప్రాథమిక కారణమని ఓ పోలీసు అధికారి చెప్పారు. ట్యాంకర్‌ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలు కాగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అంటుకోకుండా నీళ్లు చల్లారు.

Updated Date - Mar 08 , 2024 | 04:40 PM