కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్..

ABN, Publish Date - Dec 27 , 2023 | 08:34 PM

టూర్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చే పేర్లు ఊటీ, కొడైకెనాల్. ముఖ్యంగా వివాహమైన వారు హనీమూన్ వెళ్లేందుకు ఈ ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఇక్కడ కనువిందు చేసే లొకేషన్లతో పాటూ అందమైన కొండ ప్రాంతాలు, సరస్సులు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 1/8

టూర్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చే పేర్లు ఊటీ, కొడైకెనాల్. ముఖ్యంగా వివాహమైన వారు హనీమూన్ వెళ్లేందుకు ఈ ప్రాంతాలనే సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఇక్కడ కనువిందు చేసే లొకేషన్లతో పాటూ అందమైన కొండ ప్రాంతాలు, సరస్సులు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి. అయితే కొడైకొనాల్‌కు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లే వాళ్లకు.. అక్కడ అనుకూలంగా ఉండే కొన్ని బెస్ట్ హోటల్స్ గురించి తెలుసుకుందాం..

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 2/8

కోడైకెనాల్‌లో అందమైన హోటళ్లలో ఒకటైన స్టెర్లింగ్ కోడై–లేక్ హోటల్ (Sterling Codai–Lake).. విదేశాల్లోని హోటళ్లను మరపిస్తుంది. 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్లో అందమైన గదులతో పాటూ స్పా, బార్స్, వివిధ రకాల వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ బస చేసే వారు హోటల్ సమీపంలోని సరస్సు చుట్టూ సైకిల్ రైడ్ చేసే వెసులుబాటు ఉంది. అలాగే ఈ ప్రాంతం పిల్లలు గేమ్స్ ఆడేందుకు వీలుగా ఉంటుంది.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 3/8

కోడై రిసాస్ట్ హోటల్ (Kodai Resort Hotel) కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇందులో ఉన్న 50 కాటేజీలు ఉన్నాయి. ఇక్కడ లగ్జరీ సౌకర్యాలు ఉండడంతో పాటూ కుటీరాలు, అందమైన లోయలు తదితరాలు కూడా ఉన్నాయి. కుటుంబంతో కలిసి సరాదాగా గడిపేందుకు ఇది బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 4/8

అందమైన సరస్సు పక్కనే సేద తీరాలనుకునేవారికి కొడైకొనాల్లో కార్ల్టన్ అనే 5స్టార్ (Carlton Hotel) హోటల్ చాలా బాగుంటుంది. సరస్సు పక్కన ఉండే మంచి హోటళ్లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ హోటల్లో బస చేసిన వారు అందమైన దృశ్యాలను వీక్షించడంతో పాటూ సరస్సులో పడవ ప్రయాణం కూడా చేయొచ్చు.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 5/8

అందమైన ఎగుడు దిగుడు మార్గంలో ఉన్న హిల్ కంట్రీ హోటల్ (Hill Country hotel) .. సందర్శకులను కట్టిపడేస్తుంది. ఈ హోటల్ చుట్టూ ఉన్న అడవుల సౌందర్యం ఆహ్లాదాన్ని అందిస్తుంది. నగరాల్లో నిత్యం ఉరుకుపరుగుల జీవితం గడిపే వారికి ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతతను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 6/8

కొండ ప్రాంతంలో ఉండే JC రెసిడెన్సీ (JC Residency Hotel) హోటల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ హోటల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సుదరమైన ప్రాంతాలతో పాటూ రాత్రిళ్లు సవారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ జిమ్, మినీ-జూ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ హోటల్ మధురై విమానాశ్రయానికి 81 మైళ్ల దూరంలో ఉంది.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 7/8

కోడైకెనాల్‌లోని పురాతన హోటళ్లలో తమరా కోడై హోటల్ (Tamara Kodai Hotel) ఒకటి. 1840లో ఈ హోటల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ హోటల్లోని 53 సూట్‌లలో అత్యాధునికి సౌకర్యాలతో పాటూ భద్రత విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ అమెరికన్, చైనీస్, బ్రిటిష్ వంటకాలతో కూడిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

కొడైకొనాల్ వెళ్తున్నారా.. అయితే ఈ హోటల్స్ మీకు బెస్ట్ చాయిస్.. 8/8

సాహస యాత్రలు చేయడంతో పాటూ ఆధ్యాత్మిక వాతావరణం కావాలనుకునే వారికి స్పర్శ (le poshe by sparsa) హోటల్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఈ హోటల్లో చక్కటి విల్లాలతో పాటూ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గదులు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్పా సెంటర్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే పిల్లలకు ఇక్కడ వివిధ రకాల వీడియో గేమ్‌లు, ఎయిర్ హాకీ తదితర క్రీడలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Updated at - Dec 27 , 2023 | 08:34 PM