Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..

ABN, Publish Date - Dec 19 , 2023 | 03:23 PM

సాధారణంగా భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొందరి విషయంలో భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉంటుంది. అయితే..

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 1/7

సాధారణంగా భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొందరి విషయంలో భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉంటుంది. అయితే దంపతుల మధ్య సమస్యలు తలెత్తకుండా సంసారం సాఫీగా సాగాలంటే ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలనే విషయంపై అధ్యయనాలు ఏం చెబుతన్నాయంటే..

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 2/7

దంపతలు మధ్య నిర్ణీత వయస్సు అంతరం ఉండటం చాలా ముఖ్యమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధానంగా దంపతుల మధ్య ఏడాది వయస్సు అంతరం ఉంటే, వారి మధ్య విడాకులు తీసుకునే అవకాశం 3 శాతం ఉంటుందని ఓ అధ్యయనంలో వెళ్లడైంది.

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 3/7

భార్యాభర్తల మధ్య ఐదేళ్ల వయస్సు అంతరం ఉన్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం 18% ఉటుందని తెలిసింది. అదేవిధంగా 10 ఏళ్ల వయస్సు తేడా ఉన్న జంటలు విషయంలో 39%, 20 ఏళ్ల వ్యత్సాసం ఉన్న జంటల విషయంలో 95% ఉంటుందని అధ్యయనాల్లో తెలిసింది.

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 4/7

భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎంత తక్కువగా ఉంటే.. అంత సమన్వయం ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి జంటల మధ్య విడాకుల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 5/7

వయసులో 4 నుంచి 6 ఏళ్ల వ్యత్సాసం ఉన్న జంటలతో పోలిస్తే.. 3 అంతకంటే తక్కువ వ్యత్సాసం ఉన్న జంటల మధ్య సమస్యలు తక్కువగా ఉంటాయట. అలాగే 4నుంచి 6 ఏళ్ల వయసు అంతరం ఉన్న జంటలు.. 7, అంతకంటే ఎక్కువ ఏళ్ల వ్యత్సాసం ఉన్న జంటలతో పోలిస్తే.. సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిసింది.

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 6/7

మరో అధ్యయనంలో ఏం తెసిందంటే.. వివాహమైన 6-10 సంవత్సరాల తర్వాత వైవాహిత జీవితంలోని సంతృప్తి... ప్రారంభ రోజులతో పోలిస్తే చాలా తగ్గుతుందట. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఒకరి భిన్నాభిప్రాయాలు తలెత్తి సంసార జీవితం సమస్యల వలయంగా మారే అవకాశం ఉంటుంది.

Married Life: సంసార జీవితం సాఫీగా సాగాలంటే.. దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే.. 7/7

ఏజ్‌ గ్యాప్‌ ఎక్కువగా ఉన్న దంపతుల్లో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దంపతలు మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. వయసు అంతరం ఎక్కువ ఉంటే అనేక రకాల సమస్యలతో పాటూ కొన్నిసార్లు వివాహేతర సంబంధాలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంటుందని తెలిసింది.

Updated at - Dec 19 , 2023 | 03:23 PM