Share News

MS ; ఎంఎస్‌ రాజుకు బ్రహ్మరథం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:44 AM

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మడకశిర అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు నియోజకవర్గ ప్రజలు బ్రహర్మరథం పట్టారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన మండలంలోని హొట్టేబెట్ట, కొత్తపాళ్యం, టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, మల్లినమడుగు, ఎం రాయాపురం, బీజీ హళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ప్రతి గ్రామంలో హారతులతో ఘనస్వాగతం పలికారు. మల్లసముద్రం గ్రామంలో కార్యకర్తలు యాపిల్‌ పండ్ల గజమాలతో సత్కరించారు.

MS ; ఎంఎస్‌ రాజుకు బ్రహ్మరథం
A warm welcome to MS Raju

రొళ్ల, ఏప్రిల్‌ 27: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మడకశిర అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు నియోజకవర్గ ప్రజలు బ్రహర్మరథం పట్టారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన మండలంలోని హొట్టేబెట్ట, కొత్తపాళ్యం, టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, మల్లినమడుగు, ఎం రాయాపురం, బీజీ హళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ప్రతి గ్రామంలో హారతులతో ఘనస్వాగతం పలికారు. మల్లసముద్రం గ్రామంలో కార్యకర్తలు యాపిల్‌ పండ్ల గజమాలతో సత్కరించారు.


ఎంఎ్‌స రాజు మాట్లాడుతూ.. మడకశిర రూపురేఖలు మార్చడానికి టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని కోరారు. వైసీపీ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పక్కనపెట్టి డబ్బు దండుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. మల్లినమడుగు సచివాలయం అర్ధంతరంగా ఆగిపోవడమే నిదర్శనం అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.


సూపర్‌సిక్స్‌ పథకాలు, బాబు ష్యూరిటీ.. భవిషత్తు గ్యారంటీపై వివరించారు. ప్రచారంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, టీఎనటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి ఈరన్న, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌, డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సిద్దగంగప్ప, రామకృష్ణ, బీజేపీ నాయకులు మద్దరాజు, జనసేన రంగస్వామి పాల్గొన్నారు. ప్రచారం సందర్భంగా టీడీ పల్లిలో మహిళలు నీటి ఎద్దడి విషయాన్ని నాయకులకు తెలియజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2024 | 12:44 AM