Share News

రోడ్డుకు అడ్డంగా కంకర

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:13 AM

నగర శివారులోని ఏ. నారాయణపురం పంచాయతీలోని పాపంపేట పరిధిలోని విద్యారణ్యనగర్‌, బాలాజీ ఐస్‌ఫ్యాక్టరీ తదితర కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇలా అడ్డంగా రెండు నెలల క్రితం కంకర వేశారు.

రోడ్డుకు అడ్డంగా కంకర
Gravel laid across the road

అనంతపురం, సిటీ, ఏప్రిల్‌ 25: నగర శివారులోని ఏ. నారాయణపురం పంచాయతీలోని పాపంపేట పరిధిలోని విద్యారణ్యనగర్‌, బాలాజీ ఐస్‌ఫ్యాక్టరీ తదితర కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇలా అడ్డంగా రెండు నెలల క్రితం కంకర వేశారు. దీంతో ఆయా కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనుల కోసం ఆ కంకరను కాంట్రాక్టర్‌ తరలించారు.


అయితే పనులు చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. నెల తర్వాత కోడ్‌ రావడంతో ఆ పనులు ఆగిపోయాయి. అయితే కంకర ఇలా రోడ్డుపై వేయడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో మరీ దారుణం. అనేక మంది వాహనదారులు జారి పడి.. గాయపడ్డారు. రోడ్డు నిర్మాణ పనులు చేయకపోయినా... కనీసం ఆ కంకరను రోడ్డుపై తొలగించకపోవడం ఆయా కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 26 , 2024 | 12:13 AM