Share News

సరిహద్దులో కొరవడిన నిఘా

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:59 AM

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే డబ్బు,మద్యం అక్రమ రవాణాను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మడకశిర నియోజకవర్గం పూర్తిగా కర్ణాటక సరిహద్దు ప్రాంతం. దీంతో కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా ఇక్కడ సర్వసాధారణం. ఎన్నిల నోటిఫికేషన వెలువడినప్పటి నుంచి మరింత ఎక్కువైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. నిఘా బృందాల పర్యవేక్షణ అంతంతమాత్రమే ఉందని ప్రజలు వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నిల నోటిఫికేషన మార్చి16 వెలువడింది. అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

సరిహద్దులో కొరవడిన నిఘా
Checkpost set up at U Rangapuram

యథేచ్ఛగా మద్యం, డబ్బు రవాణా

మడకశిర రూరల్‌, ఎప్రిల్‌ 27 : ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే డబ్బు,మద్యం అక్రమ రవాణాను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మడకశిర నియోజకవర్గం పూర్తిగా కర్ణాటక సరిహద్దు ప్రాంతం. దీంతో కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా ఇక్కడ సర్వసాధారణం. ఎన్నిల నోటిఫికేషన వెలువడినప్పటి నుంచి మరింత ఎక్కువైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. నిఘా బృందాల పర్యవేక్షణ అంతంతమాత్రమే ఉందని ప్రజలు వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నిల నోటిఫికేషన మార్చి16 వెలువడింది.


అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎన్నికల నిబంధన మేరకు ఆ రోజు నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వయిలెన్స నిరంతరం నియోజకవర్గంలో పర్యవేక్షణ చేయాలి. సరియైున నిఘా లేకపోవడంతో కర్ణాటక నుంచి మద్యం, డబ్బు నియోజకవర్గంలోకి విచ్చల విడిగా వస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. నిఘా బృందాలను ఏర్పాటుచేసినా వారికి సరియైు వాహనాల సౌకర్యాలు కల్పించకపోవడం, కల్పించినా వాహనాలకు ఇందన సదుపాయం కల్పించకపోవడంతో ఆ బృందాలు నామమాత్రంగా తిరుగుతున్నట్లు ప్రజలంటున్నారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ కర్ణాటక సరిహద్దు ఉంది. అక్కడ నుంచి డబ్బు, మద్యం అక్రమంగా సరఫరా అయ్యే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన వెలువడిన మార్చి 16 నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో కేవలం రూ.10 లక్షలు పట్టుకున్నారు


. సంబంధిత వ్యక్తులు వాటికి సంబంధించి ఆధారాలు చూపగానే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చారు. మడకశిర నియోజకవర్గం పూర్తిగా కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావున మిగిలిన నియోజకవర్గల కంటే ఇక్కడ సీజ్డ్‌ మొత్తం ఎక్కువగా ఉండాలి. నిఘా బృందాల పర్యవేక్షణ సరిగాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని కర్ణాటక సరిహద్దులో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులలో కనీస సౌకర్యాలు కొరవడినాయి. అలాగే విద్యుత, సౌకర్యాలు లేకపోవడంతో వాహన తనిఖీల్లో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి కాలం అక్కడ పనిచేసే సిబ్బంది తాగునీరు, భోజన వసతి లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల నిధులు విడుదలైనా సరిగా వాటిని సిబ్బందికి ఖర్చుపెట్టడంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికాలు స్పందించి తగుచర్యలు తీసుకుని సరిహద్దు చెక్‌ పోస్టులలో గట్టి నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 28 , 2024 | 12:59 AM