Share News

రంగంలో 105 మంది అభ్యర్థులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:29 AM

చిత్తూరు లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన నామినేషన్ల పరిశీలన ఘట్టం శుక్రవారంతో ముగిసింది. పార్లమెంటు స్థానానికి 56, ఏడు అసెంబ్లీ స్థానాలకు 254 నామినేషన్లు అందాయి. శుక్రవారం జరిగిన పరిశీలన ప్రక్రియ అనంతరం బరిలో మొత్తం 105 మంది అభ్యర్థులు మిగిలారు.

 రంగంలో 105 మంది అభ్యర్థులు

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన నామినేషన్ల పరిశీలన ఘట్టం శుక్రవారంతో ముగిసింది. పార్లమెంటు స్థానానికి 56, ఏడు అసెంబ్లీ స్థానాలకు 254 నామినేషన్లు అందాయి. శుక్రవారం జరిగిన పరిశీలన ప్రక్రియ అనంతరం బరిలో మొత్తం 105 మంది అభ్యర్థులు మిగిలారు. వీరిలో పార్లమెంటు స్థానానికి 21మంది, అసెంబ్లీ స్థానాలకు 84 మంది ఉన్నారు. నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

అసెంబ్లీ అభ్యర్థులు తిరస్కరణకు ఆమోదం

నియోజకవర్గం వేసిన గురైన పొందిన నామినేషన్లు నామినేషన్లు నామినేషన్లు

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

పుంగనూరు 15 05 10

నగరి 24 17 07

గంగాధరనెల్లూరు 21 09 12

చిత్తూరు 21 07 14

పూతలపట్టు 19 07 12

పలమనేరు 19 05 14

కుప్పం 18 03 15

---------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 137 53 84

---------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఫ చిత్తూరు ఎంపీ స్థానం 35 14 21

---------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఉల్లంఘనల సమాచారం ఇవ్వండి

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26: ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో అందుబాటులో ఉంటారని, రోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఫిర్యాదులు కానీ, సమాచారం కానీ ఇవ్వవచ్చని చెప్పారు.

ఫ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు శంకర్‌ప్రసాద్‌ శర్మ (సెల్‌: 9281448308)

ఫ నగరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాలకు జనరల్‌ అబ్జర్వర్‌ కైలాష్‌ వాంఖ్డే (సెల్‌: 9281448305)

ఫ చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు జనరల్‌ అబ్జర్వర్‌ ఎంబీ షాదిక్‌ అలామ్‌ (సెల్‌: 9281448302)

ఫ పుంగనూరు, నగరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకుడు ఎస్‌.శ్రీనివాస్‌ ఖన్నా (సెల్‌: 9281448307)

ఫ చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకుడు రోహన్‌ ఠాకూర్‌ (సెల్‌: 9281448306)

Updated Date - Apr 27 , 2024 | 01:29 AM