Share News

50 నామినేషన్ల తిరస్కృతి

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:41 AM

తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 18 నుంచీ 25వ తేదీ వరకూ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు కలిపి మొత్తం 227 మంది నామినేషన్లు వేయగా అందులో 50 మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 177 మంది నామినేషన్లను ఆమోదించారు. ఇందులో పార్లమెంటుకు 27మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురివి చెల్లుబాటు కాలేదు. మిగిలిన 24మందివీ ఓకే అయ్యాయి. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ 200మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్‌ చేయగా పరిశీలనలో 47మందివి తిరస్కరణకు గురయ్యాయి.మిగిలిన 153మంది నామినేషన్లు చెల్లుబాటవుతాయని అధికారులు ప్రకటించారు.

50 నామినేషన్ల తిరస్కృతి

తిరుపతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 18 నుంచీ 25వ తేదీ వరకూ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు కలిపి మొత్తం 227 మంది నామినేషన్లు వేయగా అందులో 50 మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 177 మంది నామినేషన్లను ఆమోదించారు. ఇందులో పార్లమెంటుకు 27మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ముగ్గురివి చెల్లుబాటు కాలేదు. మిగిలిన 24మందివీ ఓకే అయ్యాయి. అలాగే జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ 200మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్‌ చేయగా పరిశీలనలో 47మందివి తిరస్కరణకు గురయ్యాయి.మిగిలిన 153మంది నామినేషన్లు చెల్లుబాటవుతాయని అధికారులు ప్రకటించారు.

డిపాజిట్‌ చెల్లించకుండా నామినేషన్‌

తిరుపతి పార్లమెంటు స్థానానికి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా డి.విజయ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. పరిశీలనలో ఈయన నామినేషన్‌ పత్రాలతో పాటు చెల్లించాల్సిన డిపాజిట్‌ సొమ్ము చెల్లించకపోవడంతో నామినేషన్‌ చెల్లలేదు.అలాగే మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కె.సుబ్బయ్య వేసిన నామినేషన్‌ చెల్లుబాటు కాలేదు. పరిశీలనలో పదిమంది ప్రతిపాదకు లకు గానూ తొమ్మిదిమందే ప్రతిపాదించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.

వయసు సరిపోకున్నా నామినేషన్లు

గూడూరు నియోజకవర్గంలో వయసు సరిపోకున్నా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ కుమారుడు రేవంత్‌ చక్రవర్తి వైసీపీ తరపున నామినేషన్‌ వేశారు. స్ర్కూటినీలో అతడి వయసు 24 ఏళ్ళని గుర్తించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 25ఏళ్ళు నిండి వుండాలి. దీంతో అతడి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. కాగా తండ్రి ఎమ్మెల్సీగా వుండి కూడా కనీస ఎన్నికల నిబంధనలు తెలియకుండా కుమారుడి చేత నామినేషన్‌ వేయించడం గమనార్హం. అదే నియోజకవర్గంలో కమతం కామాక్షి అనే యువతి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేశారు. పరిశీలనలో ఆ యువతి వయసు 20 ఏళ్ళని తేలింది.దీంతో ఆమె నామినేషన్‌ను కూడా తిరస్కరించారు.

ప్రతిపాదకులు లేకుండానే నామినేషన్‌

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి కుమార్తె బి.పవిత్ర వైసీపీ తరపున దాఖలు చేసిన నామినేషన్‌ చెల్లుబాటు కాలేదు. అధికారుల పరిశీలనలో ఆమె పదిమంది ప్రతిపాదకులు లేకుండానే నామినేషన్‌ వేసినట్టు గుర్తించారు.దీంతో నామినేషన్‌ను తిరస్కరిం చారు. ప్రధాన పార్టీల తరపున అసలైన అభ్యర్థి వేసే నామినేషన్‌ ఏదైనా కారణాల వల్ల చెల్లుబాటు కాకుండా పోతే ప్రత్యామ్నాయ అభ్యర్థిగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత బంధువులు నామినేషన్‌ వేయడం సర్వ సాధారణం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే కుమార్తె అసలు ప్రతిపాదకులే లేకుండా చెల్లుబాటు కాని నామినేషన్‌ పత్రాలు సమర్పించడం గమనార్హం.

సంతకాలు మరచిన ఇద్దరి నామినేషన్ల తిరస్కరణ

సత్యవేడు అసెంబ్లీకి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో కొన్ని చోట్ల సంతకాలు చేయడం మరిచారు. దీంతో వారిద్దరి నామినేషన్లు చెల్లుబాటు కాలేదు. సురేష్‌ అనే అభ్యర్థి ఫారం 26 అఫిడవిట్‌లో సంతకం చేయలేదు. అలాగే మరో ఇండిపెండెంట్‌ థామస్‌ కూడా అఫిడవిట్లలో సంతకాలు చేయలేదు.

నామినేషన్‌లో బోగస్‌ ప్రపోజర్‌

ఆయన నామినేషన్‌ వేసిందేమో నీతి నిజాయితీ పార్టీ తరపున.కానీ నామినేషన్‌ పత్రాలలో పేర్కొన్న ప్రతిపాదకుడేమో బోగస్‌. సత్యవేడు నియోజకవర్గంలో నీతి నిజాయితీ పార్టీ తరపున చిట్టిబాబు అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. స్ర్కూటినీలో ప్రతిపాదకుడు బోగస్‌ అని గుర్తించిన అధికారులు నామినేషన్ను తిరస్కరించారు.

Updated Date - Apr 27 , 2024 | 01:41 AM