Share News

ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:34 AM

‘చిత్తూరు స్పెషల్‌ బ్రాంచిలోని రామకృష్ణ, దాము అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి కోసం పనిచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సొంతూరుకు చెందిన వీరిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి’ అని చిత్తూరు టీడీపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు.

ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోండి

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లనూ ప్రభావితం చేస్తున్నారు

రామకృష్ణ, దాముపై ఈసీకి గురజాల ఫిర్యాదు

చిత్తూరు ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు స్పెషల్‌ బ్రాంచిలోని రామకృష్ణ, దాము అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి కోసం పనిచేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సొంతూరుకు చెందిన వీరిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోండి’ అని చిత్తూరు టీడీపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నిలక సంఘంతో పాటు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్‌, ఆర్వో (జేసీ) శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ‘రామకృష్ణ, దాము స్పెషల్‌ బ్రాంచిలో పనిచేస్తున్నారు. వీరు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి స్వగ్రామమైన ఎస్‌ఆర్‌పురం మండలం కొత్తపల్లిమిట్టకు చెందినవారు. చిత్తూరులో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. గతంలో స్పెషల్‌ బ్రాంచిలో పనిచేసిన సీఐ గంగిరెడ్డి వీరిని నియమించారు. స్పెషల్‌ బ్రాంచిలో పనిచేయాలంటే కనీసం హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయి ఉండాలి. అర్హత లేని వీరిని విజయానందరెడ్డి తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి నియమించుకున్నారు. నాతో పాటు నా అనుచరుల ఫోన్లను.. వాట్సాప్‌ చాట్‌లను కూడా ట్యాప్‌ చేయడంలో ఈ ఇద్దరి కుట్ర ఉంది. దీనిపై విచారించి వెంటనే చర్యలు తీసుకోండి. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు నాకు కావాల్సినవారి ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. చిత్తూరులో టీడీపీ రోజువారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వైసీపీ అభ్యర్థికి చేరవేస్తున్నారు. వైసీపీ కార్యాలయంలో కూర్చొని ఆ పార్టీకి అనుకూలంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ప్రభావితం చేస్తున్నారు. వీళ్లను స్పెషల్‌ బ్రాంచిలో కొనసాగిస్తే నిష్పక్షపాత ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. తక్షణమే వీరి మీద చర్యలు తీసుకోండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 01:34 AM