Share News

గట్లుపై గ్రద్ధలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:07 AM

గోపాలపురం నియోజకవర్గంలో పోలవరం కుడి ప్రధాన కాల్వ, తాడిపూడి ఎత్తిపోతల పథకం గట్టు ఉంటే ఒట్టు అనే పదానికి నిదర్శనం. నియోజకవర్గ ముఖ్యకేంద్రమైన గోపాలపురం మండలం చెరుకు మిల్లి గ్రామంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్టు ఉండేది. ప్రస్తుతం ఈ గట్టు ఏమైందోనని ఆశ్చర్యం నెలకొంది.

గట్లుపై గ్రద్ధలు
చెరుకుమిల్లిలో పోలవరం కుడికాల్వపై సాగు చేస్తున్న పొగాకు తోట

  • గట్లు మట్టి, ఇసుక అమ్మేసుకుంటున్న వైనం

  • అడ్డూఅదుపు లేని అధికార పార్టీ నాయకులే దోపిడీ

  • వరద మంపుపై నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన

గోపాలపురం, ఏప్రిల్‌ 25: గోపాలపురం నియోజకవర్గంలో పోలవరం కుడి ప్రధాన కాల్వ, తాడిపూడి ఎత్తిపోతల పథకం గట్టు ఉంటే ఒట్టు అనే పదానికి నిదర్శనం. నియోజకవర్గ ముఖ్యకేంద్రమైన గోపాలపురం మండలం చెరుకు మిల్లి గ్రామంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు పోలవరం కుడి ప్రధాన కాల్వ గట్టు ఉండేది. ప్రస్తుతం ఈ గట్టు ఏమైందోనని ఆశ్చర్యం నెలకొంది. అధికార పార్టీకి చెందిన దళారులే గట్టు, మట్టి, ఇసుక అమ్మేసుకుని సొమ్ము చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని వ్యవసాయ భూమిగా మార్చి ఆ భూమిలో పొగాకు సాగు చేస్తున్నారు. చెరుకుమిల్లిలోనే కాదు నియోజకవర్గంలోని గోపా లపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల వరకు ఇదే తంతు. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూఅదుపు ఉండడంలేదు. ఎవరు ఏమను కుంటే తమకేంటి అధికారంలో ఉంది తామే, మరలా అధికారంలోకి వచ్చేది తామే, గట్టు కొల్లగొట్టేది తామేననే అంటూ పేట్రేగిపోవడంతో ప్రజలు మండిప డుతున్నారు. భవిష్యత్తులో ఈ గట్టులేకపోతే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటి ప్రవాహానికి సమీప గ్రామాలు సైతం ముంపుకు గురవుతాయని, అధికార పార్టీ నాయకుల అగడాలకు హద్దు అంటూ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • కాకి పోయి రాబందు వచ్చినట్టు..

ఇక్కడ మట్టి, ఇసుక, కాల్వ గట్లు దోపిడీ కార్యకలాపాలతో అధికార పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారు. అయితే కాకిని తరిమి రాబందును రప్పించినట్టు అక్కడ నేరుగా ఇసుక దోపిడి చేసిన వ్యక్తే ఇక్కడ పోటీలో నిలపడడంతో ఓటర్లు విస్మయానికి గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసేదిలేదంటూ తెగేసి చెబుతున్నారు. మరోసాకి వైసీపీకి ఓటు వేస్తే కాల్వగట్టు ఇక్కడ ఉండేదని చెప్పుకునే విధంగా నియోజకవర్గ స్వరూపం మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడం అధికార పార్టీకి రాదంటున్నారు.

  • కనుమరుగవుతున్న దేవరకొండ

రాజంపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌.86లో 92ఎకరాల భూమి విస్తీర్ణంలో దేవరకొండ వ్యాపించి ఉంది. అయితే ఈ కొండ ప్రాంతంలో గ్రావెల్‌ పుష్కలంగా లభించడంతో అధికార పార్టీకి చెందిన సెకండ్‌ కేడర్‌ నాయకుడి అల్లుడు విచ్చలవిడిగా రేయింబవళ్లు గ్రావెల్‌ను ప్రొక్లెయినర్‌తో తవ్వి ట్రాక్టర్లపై తరలించి, అమ్ముకుని భారీగా సొమ్ముల కూడగట్టినట్టు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ ఎన్నికల అనంతరం మొదలైన ఈ గ్రావెల్‌ దోపిడీని ఉన్నతాధికారులతోపాటు పాలకులెవ్వరు నిరోధించకపోవడంతో గ్రావెల్‌ దోపిడీకి అడ్డూఅదుపు లేకుండాపోయింది. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చందంగా వైసీపీ పేరు చెప్పుకుని ఆ నాయకుడు చేసిన దోపిడీ అంతాయింతా కాదు. అయితే స్థానిక ఎస్‌ఐ ఇటీవల గ్రావెల్‌ తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు, ఒక ప్రొక్లెయినర్‌ను సీజ్‌ చేయడం కొస మెరుపు.

Updated Date - Apr 26 , 2024 | 12:07 AM